భారత్ లో 3577కి పెరిగిన కరోనా కేసులు… 83 మంది మృతి
భారత్‌ను మర్కజ్ కేసులు భయపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 3వేల 577 కేసులు నమోదయ్యాయి.

భారత్‌ను మర్కజ్ కేసులు భయపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 3వేల 577 కేసులు నమోదయ్యాయి.
భారత్‌ను మర్కజ్ కేసులు భయపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 3వేల 577 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 427 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83 మంది మృతి చెందారు. ముంబైలో నిన్న 103 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో మొత్తం 30 మంది మృతి చెందారు. ముంబైలో కరోనా పాజిటివ్ కేసులు 433కు చేరాయి. తమిళనాడులో నిన్న మరో 86 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 571కి చేరాయి. తమిళనాడులో నిన్న ఇద్దరు మృతి చెందారు. దీంతో తమిళనాడులో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.
కరోనా మహమ్మారిపై పోరులో ఐక్యత చాటాలన్న ప్రధాని పిలుపునకు యావత్ భారతావని స్పందించింది. యావత్ దేశం దీప ప్రజ్వలన చేసింది. ప్రజలంతా దీపాలు వెలిగించి ఐక్యత చాటారు. రా.9గం.లకు ఇళ్లలోని లైట్లను ఆపివేసి.. అందరూ దీపాలు, టార్చ్ లైట్లు, కొవ్వొత్తులు, మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించారు. 9నిమిషాల పాటు గుమ్మం దగ్గర, బాల్కనీల్లో నిలబడి సంఘీభావం తెలిపారు.
కరోనాపై పోరాటం దేశానికి స్ఫూర్తిగా నిలిచారు ప్రధాని మోదీ. రాత్రి 9 గంటలకు.. 9 నిమిషాల పాటు దేశమంతా దీపం వెలిగించాలని పిలుపు నిచ్చిన ప్రధాని.. తన నివాసంలో దీపం వెలిగించి సంఘీభావాన్ని చాటుకున్నారు. కరోనాపై పోరుకు దేశమంతటా దీప ప్రజ్వలన జరిగింది. హైదరాబాద్‌లో 9 నిమిషాలు దీపకాంతులు విరజిమ్మాయి. ప్రగతి భవన్‌లో కొవ్వొత్తి వెలిగించారు సీఎం కేసీఆర్. క్యాండిల్ వెలిగించి ఐక్యతను చాటిచెప్పారు.
అమరావతి తాడేపల్లిలోని తన నివాసంలో సీఎం జగన్ క్యాండిల్ పట్టుకుని సంఘీభావం తెలిపారు. 9 నిమిషాల పాటు క్యాండిల్ పట్టుకుని కరోనా కట్టడికి అందరూ సహకరించాలని సూచించారు. చీకట్లను పారద్రోలి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. కరోనా పోరాటంలో భాగంగా దీపం వెలిగించి సంఘీభావం చాటారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి. ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో ఆయన తన శిష్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరోనా నుంచి దేశానికి విముక్తి కలగాలని ఆకాంక్షించారు.
ప్రధాని మోదీ పిలుపు మేరకు మాజీ సీఎం చంద్రబాబు కూడా కొవ్వొత్తి వెలిగించారు. ఇంట్లో 9 నిమిషాల వరకు లైట్స్ ఆఫ్ చేసి..కరోనాపై కలిసికట్టుగా పోరాడేందుకు ముందుకు వచ్చారు. కరోనాపై పోరులో ఐక్యతను చాటింది యావత్ భారతవాని. 9 నిమిషాల పాటు ప్రజలు లైట్స్ ఆఫ్ చేసి..ఇళ్ల ముందు దీపాలు వెలిగించారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా క్యాండిల్ వెలిగించారు.
ప్రధాని మోడీ పిలుపు సినీ స్టార్స్ సంఘీభావం తెలిపారు. అందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి 9 నిమిషాలు లైట్స్ ఆఫ్‌చేసి క్యాండిల్స్ వెలిగించారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్, నాగార్జున, మోహన్‌బాబు, రజనీకాంత్ కొవ్వొత్లులు వెలిగించారు. గో బ్యాక్ కరోనా అంటూ నినాదాలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి లైట్స్ ఆఫ్ చేసి 9 నిమిషాలు దీపాలు వెలగించారు. తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఇంటి గుమ్మం ముందుకు వచ్చారు. బోయపాటి శ్రీనివాస్ కూడా ఫ్యామిలీతో కలిసి దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు. కరోనా చీకట్లను తొలగిపోవాలని ఆక్షాంక్షించారు.