మూడేళ్ల బాలుడికి కరోనా : భారత్‌లో 41కి చేరిన కేసులు

భారత్‌ను కరోనా భయం వీడడం లేదు. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య క్రమ క్రమం పెరుగుతోంది. కేరళ రాష్ట్రంలో ఓ మూడేళ్ల బాలుడికి వైరస్ లక్షణాలు కనిపించడంతో కలకలం రేపింది. చిన్నారి కుటుంబం ఇటీవలే ఇటలీకి వెళ్లివచ్చింది. అక్కడ కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 07వ తేదీన వారు భారత్‌కు తిరిగి వచ్చారు. కోచి ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించారు. బాలుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రును వేరుగా ఉంచారు. వీరి రక్తనమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు.(కరోనీ ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లో 16రెట్లు పెరిగిన శానిటైజర్ ధర)
ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా భారత్‌లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 41కి పెరిగింది. మరో 20 మంది అనుమానితులను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పతనంతిట్ట జిల్లాలో మూడు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు కలెక్టర్. ఈ జిల్లాలో ఓ కుటుంబంలోని ఐదుగురికి కరోనా వైరస్ సోకింది. మరోవైపు జమ్మూలో ఓ మహిళలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి.
చైనా నుంచి ఈ వైరస్ వ్యాపించింది. ప్రపంచంలోని పలు దేశాల్లోకి విస్తరించింది. భారత దేశంలోని మొట్టమొదట కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఇతర రాష్ట్రాల్లో పోల్చినా..కేరళ రాష్ట్రంలో అత్యధికంగా వైరస్ కేసులు రికార్డయ్యాయి. వైరస్ వ్యాపిస్తుండడంతో కేరళ ప్రభుత్వం పకడ్బంది చర్యలు తీసుకొంటోంది. లక్షణాలు బయటపడిన వారిని ఐసోలేషన్ కేంద్రంలో పెట్టి చికిత్స అందిస్తున్నారు. ఇతరులతో మాట్లాడనీయడం లేదు. వీరు బయట తిరిగితే…ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Read More : మారుతీరావు అంత్యక్రియలు : అమృత వస్తుందా..పోలీసుల భారీ బందోబస్తు