భారతదేశంలో కరోనా ఉగ్రరూపం..ఎన్ని కేసులంటే

భారతదేశంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ఏ మాత్రం కేసుల సంఖ్య తగ్గడం లేదు. మరణాలు కూడా అదే విధంగా ఉన్నాయి. లెటెస్ట్ గా 95 వేల 735 మందికి కరోనా సోకింది. మొత్తంగా 44 లక్షల 65 వేల 864కు కేసుల సంఖ్య చేరుకుంది.
ఒకే రోజు వేయి 172 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 75 వేల 062 మందికి చేరుకుంది. ప్రస్తుతం 9 లక్షల 19 వేల 018 యాక్టివ్ కేసులుండగా, 34 లక్షల 71 వేల 784 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
https://10tv.in/solapur-paint-walls-with-graffiti-to-teach-students-with-no-internet/
భారత్ లో రికవరీ రేటు 77.74 శాతంగా ఉండగా మరణాల రేటు 1.68 శాతంగా ఉంది. మరోవైపు భారత్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 11 లక్షల 29 వేల 756 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం గమనార్హం.