Corona Patient Demand Chicken : చికెన్ పెడితేనే..ఇంటికి వెళ్తా…అంటూ కరోనా రోగి డాన్స్

చికెన్ పెట్టాలని..తిన్న తర్వాతే..ఇంటికి వెళుతానని కరోనా నుంచి కోలుకున్న రోగి చెప్పాడు. అంతేగాదు..డ్యాన్స్ చేశాడు. ఇతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో చోటు చేసుకుంది.

Corona Patient Demand Chicken : చికెన్ పెడితేనే..ఇంటికి వెళ్తా…అంటూ కరోనా రోగి డాన్స్

Covid Center chicken

Updated On : July 10, 2021 / 7:08 PM IST

Corona Patient Dancing  : కరోనా వైరస్ సోకిన రోగులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఐసోలేషన్ సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. చికిత్స విషయంలో ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పౌష్టికాహారం అందిస్తున్నారు. చికెన్, గుడ్లు, ఇతరత్రా ఆహార పదార్థాలు రోగులకు పెడుతున్నారు. అయితే..ఓ రోగి..కరోనా నుంచి కోలుకున్నాడు. కానీ..ఇంటికి వెళ్లనని చిన్నపిల్లాడిలా మారం చేశాడు.

Read More : Ravi Shankar Prasad : తమిళనాడు గవర్నర్‌గా రవిశంకర్ ప్రసాద్!

చికెన్ పెట్టాలని..తిన్న తర్వాతే..ఇంటికి వెళుతానని ఖరాఖండిగా చెప్పాడు. అంతేగాదు..డ్యాన్స్ చేశాడు. ఇతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి కరోనా సోకడంతో…కోవిడ్ కేర్ సెంటర్ లో చేరాడు. ఇతను ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఇంటికి వెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే..తాను వెళ్లనని తేల్చిచెప్పాడు. ఎందుకని అడిగితే..ఏదో కారణాలు చెబుతున్నారు.

Read More : Pregnants Must Take Vaccine : కరోనా వల్ల ప్రసవం ముందే అయ్యే అవకాశం..గర్భిణులు త్వరగా వ్యాక్సిన్ వేయించుకోండీ

చికెన్ తినకుండా ఇంటికి వెళ్లనని చెప్పడం బట్టి చూస్తే..అక్కడ పెడుతున్న ఆహారానికి ఇతను ఫిదా అయినట్లు అర్థమౌతోంది. కోవిడ్ కేర్ సెంటర్‌లోనే డాన్స్ చేయడం ప్రారంభించాడు. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.