Corona Positive Maoists : ఛత్తీస్ గఢ్ లో 100 మంది మావోయిస్టులకు కరోనా
ఛత్తీస్ గఢ్ లో పలువురు మావోయిస్టులు కరోనా బారిన పడడం కలకలం రేపుతోంది.

Corona Positive Maoists
Corona positive for 100 Maoists : ఛత్తీస్ గఢ్ లో పలువురు మావోయిస్టులు కరోనా బారిన పడడం కలకలం రేపుతోంది. దంతేవాడ, బీజాపూర్, సుకుమా జిల్లాల్లో సుమారు 100 మంది మావోయిస్టులు కరోనాతో సతమవుతున్నట్టు తెలుస్తోంది. కరోనా బారిన పడినవారిలో మోస్ట్ వాంటెడ్ మహిళ మావోయిస్టు సుజాత కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
సుజాతపై 25లక్షల రూపాయలు రివార్డ్ ఉంది. అంతేగాక, జైలాల్, దినేష్ అనే మావోయిస్టులకు కూడా కరోనా సోకినట్లు సమాచారం. వీరిపై చెరో 10లక్షల రూపాయల రివార్డ్ ఉంది.
అయితే మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని, వారికి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ పిలుపునిచ్చారు. వారికి పూర్తి వైద్యం అందిస్తామని, వారిని లొంగిపోవాలని పోలీసులు కోరుతున్నారు.