కమ్యునిటీ ట్రాన్స్ మిషన్ ద్వారా కుటుంబానికి కరోనా.. ఆరు నెలల చిన్నారికి పాజిటివ్

  • Published By: veegamteam ,Published On : April 4, 2020 / 05:45 PM IST
కమ్యునిటీ ట్రాన్స్ మిషన్ ద్వారా కుటుంబానికి కరోనా.. ఆరు నెలల చిన్నారికి పాజిటివ్

Updated On : April 4, 2020 / 5:45 PM IST

ప్రపంచదేశాలను కరోనా వణికిస్తోంది. భారత్ తో కూడా కోవిడ్ 19 కలవరం రేపుతోంది. రోజురోజుకూ కేసులు, మృతుల సంఖ్యం పెరుగుతూనేవుంది. దేశంలోకెళ్ల కరోనా కేసులు మహారాష్ట్రలో అధికంగా నమోదవుతున్నాయి. 6 నెలల చిన్నారికి కరోనా వైరస్ సోకింది. గురువారం కళ్యాణ్ ప్రాంతానికి చెందిన 67 సంవత్సరాలు కల్గిన వ్యక్తి కరోనా లక్షణాలతో చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. అయితే అతనికి పాజిటివ్ గా నిర్ధారించారు. దీంతో అతని కుటుంబంలోని మిగిలిన వారిని కూడా క్వారంటైన్ కు పంపించారు. 

ఆ తర్వాతి రోజు ఆ కుటుంబంలోని ఆరు నెలల చిన్నారి తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ ఆస్పత్రిలో ఏమాత్రం సౌకర్యాలు లేకపోవడంతో చిన్నారిని ఎస్సార్ సీసీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి సిబ్బంది కరోనా రోగులను చేర్చుకోబోమంటూ చెప్పారు. ఓ డాక్టర్ రిఫరెన్స్ పై చిన్నారిని కస్తూర్బా ఆస్పత్రికి తరలించారు. 

అయితే అప్పిటికే చిన్నారి ఆరోగ్య క్షీణించిపోయింది. ఆమె శరీరం నీలం రగుంలోకి మారిపోయింది. కానీ అక్కడి డాక్టర్లు పట్టించుకోలేదు. సమాచారం తెలుసుకున్న మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి జోక్యం చేసుకోవడంతో చిన్నారికి డాక్టర్లు చికిత్స ప్రారంభించారు. శనివారం (ఏప్రిల్ 4, 2020) పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు.

కుటుంబీకులు ఎవరు కూడా గతంలోనూ విదేశీ పర్యటనకు వెళ్లలేదు. కమ్యునిటీ ట్రాన్స్ మిషన్ ద్వారా ఆ కుటుంబానికి కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు చెప్పారు. ఆ కుటుంబ సభ్యులు నివసిస్తున్న కళ్యాణ్, డొంబివల్లి ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.