Work From Homeకు రెడీ అవుతున్న Army

Work From Homeకు రెడీ అవుతున్న Army

Updated On : March 21, 2020 / 2:15 AM IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలని విదేశీ, సాధారణ పర్యటనలు, ఒకే చోట వందల్లో గుమిగూడటాలు, ట్రైనింగ్ కోర్సులు, ఎక్సర్‌సైజులు లాంటి వాటిని నిషేదించిన ఆర్మీ బలగాలు.. మరో అడుగేశాయి. ఇందులో భాగంగా Work From Home చేయాలని ప్లాన్ చేసుకున్నాయి. శుక్రవారం తీసుకున్న ఈ నిర్ణయాలు మార్చి 23నుంచి అమల్లోకి రానున్నాయి. 

ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌లోనే 35శాతం మంది అధికారులు ఉండి విధులు నిర్వర్తిస్తారు. వారితో పాటుగా 50శాతం మంది జూనియర్ కమిషన్ ఆఫీసర్లు, మిగిలిన ర్యాంకింగ్‌ల బట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. జనరల్ ఎమ్ఎమ్ నరవనె 13లక్షల మంది ఆర్మీకి క్వారంటైన్ సదుపాయాలు ఉన్నాయని చెప్పిన తర్వాతే ఈ ప్రక్రియ మొదలైంది. 

సెకండ్ గ్రూప్ మార్చి 30నుంచి వారంపాటు హోమ్ క్వారంటైన్‌కు వెళ్తారు. దీని ఫలితంగా గ్రూపులు అనేవి ఇంటర్ మిక్స్ అవకుండా ఉంటాయి. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లలో గుంపులు కూడా ఉండవు. వర్క్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకు టెలిఫోన్, ఎలక్ట్రానిక్ సౌకర్యాలను ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు. 

అంతేకాకుండా అన్ని ఆర్మీ కాన్ఫిరెన్స్‌లను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. టెంపరరీ డ్యూటీ చేసే వారి విధులను అప్పటి వరకూ వాయిదా వేశారు. పర్సనల్ లీవ్ మీద వెళ్లిన వారి సెలవులను ఏప్రిల్ 15వరకూ పొడిగించారు. ఆర్మీ మెడికల్ విభాగం మాత్రం గ్యాప్ లేకుండా ఏప్రిల్ 15వరకూ విధుల్లో కొనసాగాల్సి ఉంది. 

Also Read | అయ్యో కరోనా ఎంత పని చేసింది..జనరల్ బజార్ వెలవెల