నవ మాసాలు నిండిన గర్భిణీకి కరోనా పాజిటివ్‌

  • Published By: veegamteam ,Published On : April 3, 2020 / 05:47 AM IST
నవ మాసాలు నిండిన గర్భిణీకి కరోనా పాజిటివ్‌

Updated On : April 3, 2020 / 5:47 AM IST

కరోనా భూతం ఎవరినీ వదడంలేదు. ముఖ్యంగా కరోనా బాధితులకు ట్రీట్మెంటే చేసే డాక్టర్లుకు కూడా ఈ వ్యాధి సోకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలోని AIIMS హాస్పిటల్‌‌లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఓ డాక్టర్‌‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతని భార్యకు కూడా టెస్టులు చేయించాడు. దీంతో తన భార్యకు కూడా పాజిటీవ్ వచ్చింది. బాధాకరమైన విషయమేంటంటే.. అతని భార్య ఇప్పుడు 9నెలల గర్భవతి. 

ఆమెకు డెలివరీ సమయం దగ్గర పడుతుండంతో AIIMS ప్రత్యేక వార్డులో తనకు చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ప్రాణానికి ఎటువంటి ఆపదా లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. ఇక దేశవ్యాప్తంగా  శుక్రవారం (ఎప్రిల్ 3, 2020) ఉదయం నాటికి కరోనా బాధితుల సంఖ్య 2వేలకుపైగా దాటింది. మృతుల సంఖ్య 72 దాటింది.

రోజురోజుకి ఈ వ్యాధి పెరుగుతూ వస్తుందే తప్ప.. ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. 204 దేశాలకు వ్యాపించిన ఈ మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. క్షణక్షణం కొత్త కేసులు నమోదు చేస్తూ ప్రపంచదేశాల్లో దడ పుట్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య ఏకంగా 10 లక్షలు దాటింది. ఇక మరణాల సంఖ్య 52 వేల 931 కి చేరింది. కరోనా కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో ఉండగా… ఇటలీ, స్పెయిన్‌ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

Also Read | ఏపీపై కరోనా ఎఫెక్ట్: 161కి చేరుకున్న బాధితుల సంఖ్య