ఒకేరోజు 8వేలకు పైగా.. దేశంలో లక్షా 82వేల కరోనా కేసులు

  • Published By: vamsi ,Published On : May 31, 2020 / 05:04 AM IST
ఒకేరోజు 8వేలకు పైగా.. దేశంలో లక్షా 82వేల కరోనా కేసులు

Updated On : May 31, 2020 / 5:04 AM IST

భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో ఏకంగా 8,380 మందికి కొత్తగా కరోనా సోకగా 193 మంది చనిపోయారు.

జాతీయ స్థాయిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 182,143కు చేరుకుంది. ఇప్పటివరకు 5,185 మంది చనిపోగా.. 89,995 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 86,984 మంది కోలుకున్నారు.

ఢిల్లీలో కోవిడ్ -19 కేసులు పెరుగుదల గణనీయంగా ఉంది. కరోనావైరస్ కేసుల యొక్క ప్రపంచవ్యాప్తంగా 6,156,914 గా ఉండగా.. ఇప్పటివరకు 370,918 మంది ఈ వ్యాధితో చనిపోయారు. ముఖ్యంగా దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. 

మహారాష్ట్రలో 65 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 2,197 మంది చనిపోయారు. ఒకే రోజు 8వేలకు పైగా కేసులు నమోదు అవడంతో భారత్‌లో ఇదే తొలిసారి. ప్రపంచంలో కరోనా వైరస్ కేసుల విషయంలో భారత్ తొమ్మిదవ స్థానంలో ఉంది.