Coronavirus India : భారత్‌‌లో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 2 వేల 876 కేసులు

భారతదేశంలో కరోనా నుంచి చనిపోయిన వారి సంఖ్య 5,16,072గా ఉంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. 1,80,60,93,107 మంది టీకాలు వేసినట్లు వెల్లడించింది. 78.05 కోట్ల మందికి

Coronavirus India : భారత్‌‌లో కరోనా తగ్గుముఖం.. 24 గంటల్లో 2 వేల 876 కేసులు

India Corona

Updated On : March 16, 2022 / 9:57 AM IST

Coronavirus India Reports : భారతదేశంలో కరోనా భూతం మెల్లిమెల్లిగా వదులుతోంది. గతంలో కన్నా తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. పలు రాష్ట్రాల్లో వైరస్ తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో భారత్ లో 2 వేల 876 కేసులు నమోదు కాగా…3 వేల 884 మంది ఒక్క రోజులో కోలుకున్నారు. 98 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 3 వేల 811 యాక్టివ్ కేసులుండగా.. మొత్తం వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4, 24, 50, 055 చేరుకుంది.

Read More : Covid : నేటి నుంచి 12-14 ఏళ్ల వారికి కోవిడ్ టీకా

భారతదేశంలో కరోనా నుంచి చనిపోయిన వారి సంఖ్య 5,16,072గా ఉంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. 1,80,60,93,107 మంది టీకాలు వేసినట్లు వెల్లడించింది. 78.05 కోట్ల మందికి టెస్టులు నిర్వహించడం జరిగిందని, గత 24 గంటల్లో 7,52,818 మందికి పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే.. వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 462,014,781 కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం మరణాల సంఖ్య 6,073,743గా ఉంది. 394,903,304 ఆరోగ్యవంతులయ్యారు.