కరోనా చైన్ బ్రేక్…పెద్ద విజయం సాధించిన మధ్యప్రదేశ్ సిటీ

  • Published By: venkaiahnaidu ,Published On : April 8, 2020 / 09:53 AM IST
కరోనా చైన్ బ్రేక్…పెద్ద విజయం సాధించిన మధ్యప్రదేశ్ సిటీ

Updated On : April 8, 2020 / 9:53 AM IST

లోకల్ ట్రాన్స్ మిషన్(స్థానిక ప్రసారం)స్థాయిలో కరోనా వైరస్ చైన్ ను తెగగొట్టడంలో పెద్ద విజయం సాధించినట్లు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ సిటీ అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ లోని మొదటి నాలుగు కరోనా(COVID-19) కేసులు రాజధాని భోపాల్ కు 300కిలోమీటర్ల దూరంలోని జబల్ పూర్ సిటీలో నమోదవగా,గడిచిన 12రోజుల్లో అక్కడ ఒక్క కొత్త కరోనా కేసులు కూడా లేదు. కరోనా చైన్ ను బ్రేక్ చేయడంలో పెద్ద విజయం సాధించినట్లు జబల్ పూర్ అధికార యంత్రాంగం తెలిపింది.

జర్మనీ నుంచి వచ్చిన ఓ విద్యార్థికి దుబాయ్ నుంచి వచ్చిన ఓ జ్యూవెలర్,అతని భార్య,కూతురికి మార్చి20,2020న కరోనా సోకినట్లు నిర్థారణ అవడంతో ఆ మరుసటి రోజునే 20లక్షలకు పైగా జనాభా ఉన్న జబల్ పూర్ సిటీని పూర్తిగా లాక్ డౌన్ చేశారు. వైరస్ సోకిన నలుగురు మధ్యప్రదేశ్ లోకి వచ్చినప్పటినుంచి కలిసిన ప్రతి ప్రతి ఒక్కరిని  ట్రాక్ చేయాలని జబల్ పూర్ కలెక్టర్ భరత్ యాదవ్ అధికారులకు సూచించారు. మొత్తం పోలీస్,ఇంటెలిజెన్స్ నెట్ వర్క్ కలిసికట్టుగా..నలుగురు కరోనా పేషెంట్ల ప్రైమరీ కాంటాక్ట్స్ ను అదే రాత్రి జబల్ పూర్ లోనే కాకుండా 123కిలోమీటర్ల దూరంలోని మండడ్లాలో  గుర్తించారు.

మొత్తం ప్రైమరీ,సెకండరీ కాంటాక్ట్ లు తమ తమ ఇళ్లల్లో ఐసొలేట్ అయ్యారు. కరోనా లక్షణాలు వచ్చినవారిని హాస్పిటల్ లో క్వారంటైన్ లో ఉంచారు. అంతేకాకుండా కరోనా ప్రభావిత దేశాల నుంచి తిరిగొచ్చిన దాదాపు 600మందిని హోమం క్వారంటైన్ లో ఉంచబడ్డారు. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే తీసుకెళ్లి జైళ్లో పడేస్తాం అంటూ అధికారులు హెచ్చరించారు. కరోనా పోలీస్ ఫైటర్స్ పేరుతో 2వేల మంది యువ వాలంటీర్ల సాయంతో ఎస్పీ అమిత్ సింగ్ నేతృత్వంలో జబల్ పూర్ పోలీసులు కఠినంగా సోషల్ డిస్టెన్స్ విషయంలో వ్యవహరించారు. సోషల్ డిస్టెన్స్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. కూరగాయల షాపులు,మెడికల్ షాపుల దగ్గర,మిల్ బూత్ ల దగ్గర సామాజిక దూరం పాటించేలా ప్రజల్లో మార్పు తీసుకొచ్చారు. దీంతో సత్ఫలితం లభించింది. 

ఇప్పటివరకు జబల్ పూర్ సిటీలో 8కరోనా కేసులు నమోదు కాగా,గడిచిన 12రోజుల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదుకాలేదు. మంగళవారం నమోదైన 57కొత్త కేసులతో కలిసి మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు 313కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రాజధాని భోపాల్ లోనే 85 కేసులు నమోదయ్యాయి. మొత్తం మధ్యప్రదేశ్ లో 23మంది కరోనా సోకి మరణించారు. అవసరమైతే లాక్ డౌన్ ను పొడిగించేందుకు సిద్ధమేనని మంగళవారం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read | లక్ష్మణుడి కోసం హనుమంతుడు తీసుకొచ్చిన ‘సంజీవని’లాంటి హైడ్రాక్సీక్లోరోక్విన్ కోసం ఎగబడుతున్న ప్రపంచ దేశాలు