Coronavirus relief package: 32 కోట్ల మందికి రూ.29 వేల కోట్లు

Coronavirus relief package: 32 కోట్ల మందికి రూ.29 వేల కోట్లు

Updated On : April 14, 2020 / 4:09 PM IST

32 కోట్లకు మందికి పైగా సరిపడా నిధులను మోడీ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద ఇస్తామని హామీ ఇచ్చిన వాటిని విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 21రోజుల పాటు పేద ప్రజల పడిన ఆర్థిక భారం నుంచి ఉపశమనం కోసం.. కేంద్ర ప్రభుత్వం ఈ సాయం చేసేందుకు ముందుకొచ్చింది. 

రూ.1.70లక్ష కోట్ల రిలీఫ్ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. పేదలకు ఉచితంగా ధాన్యాలు పంచివ్వాలనుకుంది. పేద మహిళలకు, వృద్ధులకు నగదు సాయం అందించనున్నారు. ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి కింద ఇస్తామని ప్రకటించిన నిర్మలా సీతారామన్ 32కోట్ల మందికి సరిపడ నిధులను రూ.29వేల 352కోట్లు విడుదల చేసింది ఆర్థిక శాఖ అని ట్వీట్ చేశారు. 

పీఎం కిసాన్ స్కీంలో భాగంగా రూ.14వేల 946కోట్లను తొలి ఇన్ స్టాల్మెంట్ గా విడుదల చేశాం. 7కోట్ల మందికి పైగా రూ.2వేల రూపాయలు తమ అకౌంట్లలోకి వస్తాయి. 19.86 కోట్ల మహిళలకు జన ధన అకౌంట్లలోకి రూ.500 వస్తాయి. మొత్తం 9వేల 930కోట్ల మందికి సహకారం అందనుంది. 

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్ యోజన్ కింద 2.65లక్షల మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు 5.29కోట్ల మంది బెనిఫిషియర్లకు అందే ఏర్పాటు చేయనున్నారు. 3వేల 985మిలియన్ టన్నుల ధాన్యం పలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపించనున్నారు. నేషనల్ సోషల్ అసిస్టెనస్ ప్రోగ్రాం రూ.1400కోట్లనుు 2.82కోటి మంది వయో వృద్ధులకు, వితంతువులకు, వికాలాంగులకు ఇవ్వనున్నారు. ప్రతి బెనిఫిషియరికీ ఈ స్కీం కింద రూ.1000 అందుతుంది. కనీసం 2.17 కోటి భవన నిర్మాణ కార్మికులు రూ.3వేల 71 కోట్లు అందుకుంటారు. 

Also Read | కరోనా మందు: రెండు వ్యాక్సిన్లు రెడీ చేసిన చైనా