జమ్మూ కశ్మీర్లో మార్చి 31వరకూ అన్నీ బంద్ (స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, అంగన్వాడీలు, సినిమా హాళ్లు)

కరోనా భయంతో జమ్మూ అండ్ కశ్మీర్ అంతా బంద్ ప్రకటించింది ప్రభుత్వం. మార్చి 31వరకూ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, అంగన్వాడీలు, సినిమా హాళ్లు మూసేయాలని ఆదేశాలిచ్చారు. బోర్డ్, కాంపిటీటివ్ పరీక్షలకు ఇది ఏ మాత్రం ఇబ్బంది కాదని కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్(డీఐపీఆర్) తెలిపింది.
‘జమ్మూ అండ్ కశ్మీర్‌లో ఉన్న పబ్లిక్, ప్రైవేట్ విద్యా సంస్థలు స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నింటినీ 2020 మార్చి 31వరకూ మూసేయాలి. బోర్డ్ అండ్ కాంపిటీటివ్ పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో అనవసర ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిదని’ ట్వీట్ ద్వారా వెల్లడించారు అధికారులు.
వీటితో పాటుగా మార్చి 31వరకూ 10జిల్లాల్లోనూ అంగన్వాడీ సెంటర్లు, సినిమా హాళ్లు కూడా మూసేస్తున్నారు. బుధవారం ఓ మహిళకు కరోనా పాజిటివ్ కేసు నమోదైన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఆ మహిళ కలిసిన వారందరికీ కరోనా వైద్య పరీక్షలు చేస్తున్నారు వైద్యులు.