సనాతన వివాదం.. ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట
ఉదయనిధి స్టాలిన్‌తో పాటు మరో ఇద్దరు డీఎంకే నేతలను చట్టసభ ససభ్యులుగా కొనసాగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం కొట్టివేసింది.

Court Dismisses Petition Against Udhayanidhi Stalin Over Sanatana Remarks
Udhayanidhi Stalin: డీఎంకే యువనేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఉదయనిధి స్టాలిన్‌తో పాటు మరో ఇద్దరు డీఎంకే నేతలను చట్టసభ ససభ్యులుగా కొనసాగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. సనాతన ధర్మంపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనను ఇంకా ఏ కోర్టు దోషిగా నిర్ధారించలేదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. జూనియర్ స్టాలిన్ చేసిన తప్పని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఉదయనిధి స్టాలిన్ గత సెప్టెంబర్‌లో సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ లాంటిదని.. దాన్ని నిర్మూలించాల’ని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపాయి. ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు మంత్రి పీకే శేఖర్ బాబు, డీఎంకే ఎంపీ ఏ రాజా అక్కడే ఉన్నారు. దీంతో పిటిషనర్లు ఈ ముగ్గురికి వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. వీరిని చట్టసభల నుంచి బయటకు పంపించాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీన్ని తాజాగా ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
హైకోర్టు తీర్పును ఉదయనిధి స్టాలిన్ తరపు న్యాయవాది, డీఎంకే ఎంపీ పి విల్సన్ స్వాగతించారు. హిందూ మతానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడలేదని, ఆయన ప్రసంగాన్ని బీజేపీ వక్రీకరించిందని ఆయన ఆరోపించారు. కుల వివక్ష, కుల ఆధిపత్యాన్ని మాత్రమే ప్రశ్నించారని వివరించారు. కాగా, ఈ వివాదంలో ఉదయనిధి స్టాలిన్‌పై దేశవ్యాప్తంగా చాలా కేసులు నమోదయ్యాయి. వీటన్నంటినీ కలిపి విచారించాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Also Read: నీటి ఎద్దడితో బెంగళూరు వాసులు విలవిల.. తాగునీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు