ఏపీలో కరోనా అప్‌డేట్: 266కి పెరిగిన కరోనా కేసులు

  • Published By: vamsi ,Published On : April 6, 2020 / 06:12 AM IST
ఏపీలో కరోనా అప్‌డేట్: 266కి పెరిగిన కరోనా కేసులు

Updated On : April 6, 2020 / 6:12 AM IST

కరోనా వైరస్‌(కోవిడ్‌–19) దేశవ్యాప్తంగానూ, రాష్ట్ర వ్యాప్తంగానూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నాలుగు వేలకు దాటిపోగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కేసులు 266కు చేరుకున్నాయి. మర్కజ్‌ సదస్సు కేసులు రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 60 కరోనా కేసులు నమోదవగా.. అందులో కర్నూలులో అత్యధికంగా 53 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో నిన్న సాయంత్రం 6గంటల నుంచి 9గంటల వరకు జరిగిన పరీక్షల్లో కొత్తగా 14కేసులు నమోదు అయ్యాయి. 

కొత్తగా నమోదైన కేసుల్లో విశాఖ నుంచి 5, అనంతపూర్ నుంచి 3 కర్నూల్ నుంచి 3 గుంటూరు నుంచి 2, పశ్చిమగోదావరిలో ఓ కేసు నమోదు అయ్యింది. తాజా నివేధికల ప్రకారం నెల్లూరు- 34, గుంటూరు- 32, కృష్ణా- 28, ప్రకాశం- 23, కడప- 23, చిత్తూరు-17, విశాఖ- 20, పశ్చిగోదావరి-16 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి- 11, అనంతపురం-6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఇక దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు 4067కి చేరుకున్నాయి. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు గడిచిన 12 గంటల్లో ఏకంగా 490 నమోదయ్యాయని కేంద్రం ప్రకటించింది. ఇప్పటి వరకు అందులో 292 మంది కొలుకోగా, 109 మంది చనిపోయినట్లు వెల్లడించింది. 690 కరోనా పాజిటివ్‌ కేసులతో మహారాష్ట తొలిస్థానంలో ఉండగా, తమిళనాడు 571, ఢిల్లీ 503 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

ఇక తెలంగాణలో 321, కేరళలో 314, రాజస్థాన్‌లో 253, ఆంధ్రప్రదేశ్‌లో 266, ఉత్తరప్రదేశ్‌లో 221, మధ్యప్రదేశ్‌లో 165, కర్ణాటకలో 151, గుజరాత్‌లో 122, జమ్మూకశ్మీర్‌లో 106 కరోనా పాజిటివ్‌ కేసులు ఇప్పటివరకు నమోదైయ్యాయి.

Also Read | లాక్ డౌన్..మాంగల్యం తంతునానేనా : నాలుగు నిమిషాల్లో పెళ్లి