Covid-19 : కేరళలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు.. ముగ్గురు మృతి

మరోసారి కోవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో కోవిడ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. పలు వేరియంట్లుగా ప్రపంచాన్ని భయపెట్టిన కోవిడ్ మరోసారి భారత్ లో కూడా విస్తరిస్తోంది. కేరళలో కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.

Covid-19 : కేరళలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు.. ముగ్గురు మృతి

covid in kerala

Updated On : December 20, 2023 / 10:30 AM IST

covid in kerala : మరోసారి కోవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో కోవిడ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. పలు వేరియంట్లుగా ప్రపంచాన్ని భయపెట్టిన కోవిడ్ మరోసారి భారత్ లో కూడా విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా కేరళలో కోవిడ్ కేసులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా గత 24గంటల్లో 341 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇక కేరళ విషయానికొస్తే దేశంలో కేరళ రాష్ట్రంలోనే మహమ్మారి ప్రతాపం కనిపిస్తోంది.

కోవిడ్ తో కేరళలో ముగ్గురు మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 2311 యాక్టివ్ కేసులున్నాయి. కేరళ తరువాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి ,మహారాష్ట్రలో కోవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. జెఎన్ 1 కొత్త వేరియంట్ నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

కాగా..ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న కొవిడ్-19 ఓమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్ 1 వేరియంట్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వ్యాఖ్యలు చేసింది. జేఎన్ 1 కరోనావైరస్ జాతి ప్రజారోగ్యానికి పెద్దగా ముప్పు కలిగించదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. జేఎన్ 1 సబ్ వేరియంట్ వల్ల ఎదురయ్యే ప్రజారోగ్య ప్రమాదం తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనా వేసింది. కొవిడ్ బీఏ 2.86 జాతికి చెందిన సబ్ వేరియంట్ జేఎన్ 1 అని ఆ సంస్థ వర్గీకరించింది. ప్రస్తుతం ఉన్న కొవిడ్ వ్యాక్సిన్‌లు కొవిడ్ -19 జేఎన్ 1 వైరస్ వల్ల మరణాల నుంచి రక్షణను కొనసాగిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ తెలిపింది.