కరోనా ఐసోలేషన్ ఎస్కేప్..ప్రియుడితో పాటు లవర్‌ బుక్కయింది

కరోనా ఐసోలేషన్ ఎస్కేప్..ప్రియుడితో పాటు లవర్‌ బుక్కయింది

Updated On : March 28, 2020 / 4:17 AM IST

దుబాయ్ లో పనిచేస్తున్న 24 ఏళ్ల విజయ్.. హుటాహుటిన బయల్దేరి వచ్చాడు. అతణ్ని మధురై ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్న పోలీసులు 8మంది బృందంతో కలిపి బుధవారం ఐసోలేషన్‌కు పంపారు. అక్కడికి దగ్గర్లో ఉన్న శివగంగ గ్రామంలో గర్ల్ ఫ్రెండ్ ను కలిసేందుకు తప్పించుకున్నాడు. సెల్ సిగ్నల్ ఆధారంగా వెతికి పట్టుకుని మళ్లీ ఐసోలేషన్‌కు పంపారు. 

స్థానికుల సమాచారం ప్రకారం.. ప్రేమ వ్యవహారమై వచ్చినట్లు చెబుతున్నారు. యువతి కుటుంబ సభ్యులు ప్రేమను ఒప్పుకోలేదు. దాంతో యువతి లవర్ కు సమాచారం ఇచ్చింది. ఇద్దరూ పారిపోయి గ్రామంలో ఓ ప్రదేశంలో కలుద్దామని నిర్ణయించుకున్నారు. అటు నుంచి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఐసోలేషన్ లో ఉన్న వ్యక్తి కనిపించకపోవడంతో పోలీసులు వెదకడం మొదలుపెట్టారు. 

విజయ్.. తన లవర్ తో కమ్యూనికేట్ అవడం కోసం ఫోన్ స్విచాఫ్ చేయకుండా ఉంచాడు. ఇదే అదనుగా పోలీసులు సెల్ సిగ్నల్ ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. అవనియపురం పోలీసులు యువకుడు ఉన్న ప్లేస్ ను గుర్తించారు. యువతి లవ్ ఎఫైర్ కు అడ్డు చెప్పిన కుటుంబ సభ్యులు వేరే పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో తామిద్దరం పెళ్లి చేసుకునేందుకు పారిపోయినట్లు తెలుసుకున్నారు. 

యువతి కుటుంబ సభ్యులు.. విజయ్ ఇంటిపై దాడి చేసి కొట్టినట్లు సమాచారం. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రేమికులిద్దరినీ ఐసోలేషన్ కు పంపారు. 

Also Read | కూతుళ్లే మంత్రసానులై పురుడు పోశారు