Covid-19 Effect : 2022 జనవరిలో రికార్డు స్థాయిలో పెరిగిన డోలో, ఆగ్మెంటిన్‌ ట్యాబ్లెట్ల సేల్స్..

కరోనా పుణ్యామని మెడికల్ రంగం పుంజుకుంది. కరోనా కాలంలో కొంచెం జ్వరంగా అనిపించినా లేదా తలనొప్పిగా ఉన్నా.. ఒళ్లు నొప్పులు ఏదైనా సరే.. వెంటనే డోలో (Dolo 650) ట్యాబ్లెట్ వేసేస్తుంటారు.

Covid-19 Effect : 2022 జనవరిలో రికార్డు స్థాయిలో పెరిగిన డోలో, ఆగ్మెంటిన్‌ ట్యాబ్లెట్ల సేల్స్..

Covid 19 Effect Dolo, Augmentin Tablets Top Selling Medicines In Jan 2022

Updated On : February 16, 2022 / 8:39 AM IST

Covid-19 Effect : కరోనా పుణ్యామని మెడికల్ రంగం పుంజుకుంది. కరోనా కాలంలో కొంచెం జ్వరంగా అనిపించినా లేదా తలనొప్పిగా ఉన్నా.. ఒళ్లు నొప్పులు ఏదైనా సరే.. వెంటనే డోలో (Dolo 650) ట్యాబ్లెట్ వేసేస్తుంటారు. అనారోగ్య సమస్య చిన్నదైనప్పటికీ చాలామందికి ఈ డోలో ట్యాబ్లెట్‌ అలవాటుగా మారిపోయింది. కరోనా కాలంలో ఈ డోలోకు ట్యాబ్లెట్ మాత్రం ఫుల్ క్రేజ్ పెరిగింది. కరోనా చికిత్సలో ఈ ట్యాబ్లెట్ అనేది కీలకంగా మారింది. వైద్యులు కూడా ఇదే మెడిసిన్ సిఫార్సు చేయడంతో వినియోగం అత్యధిక స్థాయిలో పెరిగింది. కరోనా ఆరంభం నుంచే ఈ ట్యాబ్లెట్ అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి. భారతదేశంలో ప్రజాదరణ పొందిన అనేక ట్యాబ్లెట్లలో డోలో 650 ముందు వరుసలో నిలిచింది.

కోవిడ్-19 మూడవ వేవ్ సమయంలో బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ నుంచి వచ్చిన పారాసెటమాల్ బ్రాండ్ అయిన డోలో (Dolo) జనవరిలో రికార్డు స్థాయిలో సేల్ అయింది. దాంతో ఈ మైక్రో ల్యాబ్స్ భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడైన డ్రగ్ బ్రాండ్‌గా నిలిచింది. డోలోతో పాటు GSK యాంటీబయాటిక్ ఆగ్మెంటిన్‌ (Augmentin) కూడా రికార్డు స్థాయిలో అమ్మడైంది. ఈ రెండు బ్రాండ్‌లు ఒక్కో నెలలోరూ.57 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. డోలో 210శాతం వృద్ధిని సాధించగా.. ఆగ్మెంటిన్ 62శాతంతో 2022 జనవరిలో సేల్స్‌లో దూసుకెళ్లింది. గత ఏడాదిలోనూ ఇదే స్థాయిలో అమ్మకాల్లో దూసుకెళ్లింది. ఫార్మాస్యూటికల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ AIOCD Pharmasofttech AWACS Pvt Ltd, దేశంలో ఔషధ విక్రయాల డేటాను విశ్లేషించింది. ఈ నెలలో డోలో నంబర్ 1 బ్రాండ్‌గా నిలవగా… ఆగ్మెంటిన్ తర్వాతి స్థానంలో నిలిచింది.

రూ.474 కోట్ల అమ్మకాలతో 9వ స్థానంలో డోలో :
వార్షిక ప్రాతిపదికన ప్రకారం.. భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఔషధ బ్రాండ్ గ్లెన్‌మార్క్ ఫాబిఫ్లూ (Fabiflu) 12 నెలల ఆదాయం రూ.753 కోట్లతో వెనుకబడి ఉంది. ఆస్పత్రిలో చేరిన కోవిడ్-19 బాధితులకు ఎక్కువగా సూచించిన ఔషధాల్లో ఫ్యాబిఫ్లూ ఒకటి.. జనవరి 2022 నెలలో రూ.18 కోట్ల అమ్మకాలతో 77వ ర్యాంక్‌లో నిలిచింది. ఇప్పుడు కోవిడ్-19 బాధితులు ఆసుపత్రిలో చేరడం తగ్గడంతో దీని అమ్మకాలు నెమ్మదించాయి. జనవరి 2022తో సహా గత 12 నెలల వ్యవధిలో వార్షిక మొత్తం లేదా MAT ప్రకారం.. రూ.474 కోట్ల అమ్మకాలతో Dolo 9వ స్థానంలో నిలిచింది. 3వ స్థానంలో ఉన్న ఆగ్మెంటిన్ రూ.599 కోట్లతో దూసుకెళ్తోంది. భారతదేశంలో కరోనా చికిత్స అవసరమయ్యే ఔషధాల్లో ముఖ్యంగా డోలో వినియోగానికి అత్యంత ప్రాధాన్యత లభించినట్టు హెల్త్‌కేర్ మార్కెట్ ఇన్‌సైట్ సర్వీసెస్ సంస్థ ప్రోంటో కన్సల్ట్ (Pronto Consult) ఒక ప్రకటనలో తెలిపింది. సగటున, భారతదేశవ్యాప్తంగా ఉత్పత్తి అయిన 47శాతం బిల్లులలో డోలో ట్యాబ్లెట్ ఉంది. ఇటీవలి వారాల్లో 53శాతం రిటైల్ కెమిస్ట్‌లు డోలో కొత్త ప్రిస్క్రిప్షన్‌లు వచ్చినట్టు తెలిపారు. 56శాతం హెల్త్‌కేర్ నిపుణులు (HCP) గత కొన్ని రోజులుగా డోలో-650ని సూచించినట్లు చెప్పారు. గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధపడేవారికి ఎక్కువగా డోలో 650 ట్యాబ్లెట్ సూచించడంతో దీని అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణాలుగా ప్రోంటో కన్సల్ట్ వ్యవస్థాపకుడు హరి నటరాజన్ చెప్పారు.

Covid 19 Effect Dolo, Augmentin Tablets Top Selling Medicines In Jan 2022 (1)

కరోనా కారణంగానే భారీగా పెరిగిన డోలో అమ్మకాలు :
అధ్యయనంలో భాగంగా ప్రోంటో ద్వారా భారత్ అంతటా దాదాపు 2వేల మంది వాటాదారులపై సర్వే చేశారు. గత దశాబ్ద కాలంగా డోలో మెడిసిన్ స్థిరంగా అమ్మకాల్లో కొనసాగుతోంది. Chikungunya, H1N1, Dengue వ్యాధులతో పాటు ఇప్పుడు Covid-19 సమయంలోనూ Dolo 650 అమ్మకాలు బాగా పెరిగాయని హరి నటరాజన్ చెప్పారు. సీజనల్ వంటి వ్యాధుల వ్యాప్తి సమయంలో ఇతర పారాసెటమాల్ కంటే డోలో-650 (Dolo 650) అధిక జ్వరంతో పాటు నొప్పి నివారణలో బాధితులకు ఎంతో ఉపశమనం కలిగించిందనే విషయాన్ని వైద్యులు కనుగొన్నారని అధ్యయనం పేర్కొంది.

ఫ్లాగ్‌షిప్ ప్రొడక్ట్ అయిన డోలో బ్రాండ్ 650mg టాబ్లెట్.. 3 దశాబ్దాల క్రితమే అత్యంత సాధారణమైన పారాసెటమాల్ ఫార్ములేషన్ 500mgగా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. డోలో-650 ఎక్కువ కాలం పని చేస్తుంది. అందుకే దీని మోతాదును తగ్గించినట్టు కంపెనీ తెలిపింది. పారాసెటమాల్ 500 మిల్లీగ్రాములు తీసుకునే బాధితులు రోజు తీసుకునే పారాసెటమాల్ కన్నా తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.  2020లో క‌రోనా ప్రారంభం నుంచి ఏకంగా 350 కోట్ల డోలో 650 ట్యాబ్లెట్లు అమ్ముడుపోయాయి. ఈ మొత్తం ట్యాబ్లెట్ల‌ను పేర్చితూ పోతే ఎవ‌రెస్ట్ ప‌ర్వ‌తం కంటే 6వేల రెట్లు ఎక్కువ ఎత్తు ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. క‌రోనాకు ముందు ఈ మెడిసిస్ సేల్స్ స్థాయిలో లేదనే చెప్పాలి. 2019లో భార‌త్‌లో 75 మిలియ‌న్ స్ట్రిప్లతో డోలో ట్యాబ్లెట్లను విక్రయించింది. 2021లోనే డోలో ట్యాబ్లెట్ రూ. 307 కోట్ల ట‌ర్నోవ‌ర్ న‌మోదు చేసింది.

Read Also : Dolo 650: రికార్డ్ స్థాయిలో డోలో సేల్స్… 10నెలల్లో రూ.567కోట్లు