కరోనా రోగి ఉన్నాడని..పైలట్ ఏం చేశాడో తెలుసా

  • Published By: madhu ,Published On : March 24, 2020 / 02:13 AM IST
కరోనా రోగి ఉన్నాడని..పైలట్ ఏం చేశాడో తెలుసా

Updated On : March 24, 2020 / 2:13 AM IST

కరోనా…ప్రస్తుతం ఎక్కడ చూసినా దీనిపైనే హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఈ వైరస్ ని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. కానీ..ఈ వైరస్ సోకిన వారి దగ్గరకు వెళ్లాలంటేనే జనాలు జంకుతున్నారు. ఈ వ్యాధి తమకు ఎక్కడ సోకుతుందేమన్న భయం అందరిలోనూ ఉంటోంది. విమానంలో కరోనా లక్షణాలతో ఓ రోగి ప్రయాణిస్తున్నాడని తెలుసుకున్న కో పైలట్ చేసిన వ్యవహారం వైరల్ అయ్యంది. ఇది…ఢిల్లీ ఎయిర్ ఏషియా విమానంలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే…
2020, మార్చి 20వ తేదీన పూణే నుంచి న్యూ ఢిల్లీకి 15-732 ఏయిర్ ఏషియా విమానం వచ్చింది. కానీ కాక్ పిట్ సమీపంలో కరోనా వైరస్ లక్షణాలతో ఓ ప్రయాణీకుడు కూర్చొన్నాడని సమాచారం వచ్చింది. ఈ విషయాన్ని విమాన పైలట్ గుర్తించాడు. దీంతో విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో మారుమూలన దూరంగా ల్యాండ్ చేశారు. అక్కడికి వైద్య బృందం చేరుకుంది. కరోనా వైరస్ ఉందన్న వ్యక్తికి పరీక్షలు నిర్వహించారు. అతనికి నెగటివ్ వచ్చింది. అందరిలోనూ భయం నెలకొంది. 

అనంతరం ప్రయాణికులను ముందు ద్వారం నుంచి కాకుండా..వెనుక ద్వారం నుంచి దింపేశారు. కానీ..విమాన పైలెట్ మాత్రం దిగలేదు. క్యాబిన్ లోనే కూర్చుండిపోయాడు. అంటే..తనకు తానే.. క్వారంటైన్ విధించుకున్నాడు. విమానాన్ని మొత్తం శానిటైజ్ చేశారు. తర్వాత..ఆ పైలట్ విమానం నుంచి దిగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. 

 

See Also |  పుట్టిన బిడ్డకు ‘కరోనా’ అని పేరు పెట్టారు: చెడుతో పోరాటానికి చిహ్నంగా!