India Covid Cases Update : దేశంలో 2 లక్షలకు చేరువలో కోవిడ్ కేసులు

దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగూతూ వస్తోంది. కొత్తగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉన్నాయి.

India Covid Cases Update :  దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగూతూ వస్తోంది. కొత్తగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉన్నాయి. నిన్న కొత్తగా 1,94,720 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 442 మంది నిన్న కోవిడ్ సంబంధిత వ్యాధులతో కన్నుమూశారు. దేశంలో క్రియాశీలక కేసుల సంఖ్య 9,55,319కి చేరింది. దేశంలో పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది.

మహారాష్ట్రలో నిన్న 34, 424 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అంతకు ముందురోజు కంటే 954 కేసుల ఎక్కువ వచ్చాయి. మహారాష్ట్ర  రాజధాని ముంబై లో మంగళవారం 11,647 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్ లో 21,098 పాజిటివ్ కేసులు రావటంతో రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. తమిళనాడులో 15,379 కేసులు…. కేరళలో 9,066 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కర్ణాటకలో కేసుల సంఖ్య పెరగటంతో ఆస్పత్రుల్లో బెడ్ లు  దొరక్క రోగులు ఇబ్బంది పడుతున్నారు.

Also Read :Divorce : పాట నచ్చలేదని భార్యకు విడాకులిచ్చిన కొత్త పెళ్లికొడుకు

దేశంలోనిన్న 4,868 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. నిన్న మహారాష్ట్రలో అత్యధికంగా 1281 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రాజస్ధాన్ 645, ఢిల్లీలో 546 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు