Covid Positive : మహారాష్ట్రలో 10 మంది మంత్రులు, 20 మందికి పైగా ఎమ్మెల్యేలకు కరోనా

ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిశాయి. మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తోంది.

Covid Positive : మహారాష్ట్రలో 10 మంది మంత్రులు, 20 మందికి పైగా ఎమ్మెల్యేలకు కరోనా

Corona (1)

Updated On : January 1, 2022 / 12:14 PM IST

covid for ministers and MLAs : భారత్ లో ఒకవైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణుకుపుట్టిస్తున్నాయి. దేశంలో కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో మంత్రులు, ఎమ్మెల్యేల్లో కరోనా కలవరం నెలకొంది. రాష్ట్రలో 10 మంది మంత్రులు, 20 మందికి పైగా ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిశాయి. మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 1,04,781 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 4,81,486 మరణాలు నమోదు అయ్యాయి.

మరోవైపు దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్ పాకింది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,431కి చేరింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ వేరియంట్ బారినపడిన వారిలో 488 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో నమోదయ్యాయి.

Youngster Died : సహాయం చేసేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు

మహారాష్ట్రలో 454, ఢిల్లీలో 351, తమిళనాడులో 118, గుజరాత్ 115, కేరళలో109, రాజస్థాన్ 69, తెలంగాణ 62, హర్యానా 37, కర్ణాటక 34 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేనివారికి కూడా సోకుతోంది. మహారాష్ట్రలో ట్రావెల్ హిస్టరీ లేని 141 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు.

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇక న్యూ ఇయర్ వేడుకలపై కూడా పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి.