Corona Cases: ఢిల్లీలో రెండు రోజులుగా తగ్గిన కరోనా కేసులు.. కారణం ఇదేనా?

Covid Cases Comes down in Delhi from 2-3 Days

Corona Cases: ఢిల్లీలో రెండు రోజులుగా తగ్గిన కరోనా కేసులు.. కారణం ఇదేనా?

Delhi

Updated On : January 16, 2022 / 8:55 AM IST

Corona Cases: క‌రోనా కేసులు ఢిల్లీలో ఢిల్లీలో రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. అయితే, టెస్ట్‌ల సంఖ్య‌ తగ్గడం వల్లే కేసులు తగ్గాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఢిల్లీలో ఇన్ఫెక్షన్ రేటు 30శాతం ఉన్నప్పటికీ, ఢిల్లీలో రెండు రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడానికి కారణం టెస్ట్‌ల సంఖ్య తగ్గడమే అనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే, ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ కూడా మరో కారణంగా చెబుతున్నారు.

ఢిల్లీలో వరుసగా రెండు రోజుల లెక్కలు చూస్తే..
జనవరి 13వ తేదీ 28వేల 867 కేసులు నమోదవగా.. అంతకుముందు రోజు కంటే 1306 కేసులు పెరిగాయి.
అయితే, జనవరి 14వ తేదీ 24వేల 383కేసులు నమోదయ్యాయి. అంటే 4,484 కేసులు తగ్గాయి.
అలాగే, జనవరి 15వ తేదీ 20వేల 718కేసులు నమోదవగా.. 3వేల 665 కేసులు తగ్గిపోయాయి. అంటే రెండు రోజుల్లో దాదాపు 8 వేల కేసులు తగ్గాయి.

ఢిల్లీ ఆరోగ్య మంత్రి మాత్రం.. కోరానా పర్వం దాటేశామని, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని వెల్లడించారు. ఢిల్లీలో కరోనా పరీక్షలు తగ్గినందున ఈ సంఖ్య తగ్గుతోందా? అనేది పెద్ద ప్రశ్న. ఆ అనుమానం ఎందుకు వస్తుందంటే, జనవరి 13వ తేదీ ఢిల్లీలో 98వేల 832పరీక్షలు జరగ్గా.. జనవరి 14వ తేదీన 79వేల 578 పరీక్షలు నిర్వహించారు. జనవరి 15వ తేదీన 67వేల 624 పరీక్షలు జరిగాయి
పరీక్షలను తగ్గించడం ఇది వరుసగా మూడో రోజు. అంతకుముందు జనవరి 12న దాదాపు లక్ష పరీక్షలు జరిగాయి.

వాస్తవానికి, గత 5-6 రోజులుగా ఆసుపత్రుల్లో అడ్మిషన్లు పెరగనందున ఢిల్లీ ఆరోగ్య మంత్రి కరోనా తగ్గిందని అభిప్రాయపడ్డారు. దాదాపు 85 శాతం బెడ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.