Karnataka : కేరళ నుంచి కర్ణాటక వచ్చేవారికి ఇవి తప్పని సరి

కేరళ నుంచి కర్ణాటక వచ్చే వారు ఆర్టీ-పీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్ట్‌ లేదా రెండు డోసుల కరోనా టీకా ధ్రువీకరణ పత్రాన్ని తప్పని సరిగా చూపించాలని ఆదేశించింది. చేసింది.

Karnataka : కేరళ నుంచి కర్ణాటక వచ్చేవారికి ఇవి తప్పని సరి

Karnataka Yediyurappa

Updated On : July 1, 2021 / 10:40 PM IST

Karnataka : కేరళలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కర్ణాటక లోని యెడియూరప్ప ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ నుంచి కర్ణాటక వచ్చే వారు ఆర్టీ-పీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్ట్‌ లేదా రెండు డోసుల కరోనా టీకా ధ్రువీకరణ పత్రాన్ని తప్పని సరిగా చూపించాలని ఆదేశించింది. కేరళ నుంచి కర్ణాటకకు విమానాలు, బస్సులు, రైళ్లు, ట్యాక్సీలు, వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారు ఈ పత్రాలను తప్పని సరిగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.

ఆర్టీ-పీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్ట్‌ 72 గంటలకు మించకూడదని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి కరోనా పరీక్ష నిర్వహించి వాటి ఫలితాల మేరకు చర్యలు తీసుకుంటామని వివరించింది.

అలాగే విద్య, వ్యాపారం, ఇతర పనుల కోసం కర్ణాటకకు వచ్చిన వారు ప్రతి 15 రోజులకు  ఒకసారి ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకుని నెగిటివ్‌ రిపోర్టును సమర్పించాలని తెలిపింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సంబంధిత చట్టాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.