Covid Cases : భారత్ లో భారీగా తగ్గుతున్న కోవిడ్ కేసులు

దేశంలో ఇప్పటివరకు 4,28,67,031 కేసులు, 5,12,622 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో 98.42 శాతంగా కరోన రికవరీ రేటు ఉంది. నిన్న కరోనా నుంచి 31,377 మంది కోలుకున్నారు.

Covid Cases : భారత్ లో భారీగా తగ్గుతున్న కోవిడ్ కేసులు

India (1)

Updated On : February 23, 2022 / 10:06 AM IST

covid cases declining : భారత్ లో కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. దేశంలో భారీగా కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. దేశంలో కొత్తగా 15,102 కేసులు, 278 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 1,64,522 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో 0.38 శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 1.28 శాతానికి చేరుకుంది.

దేశంలో ఇప్పటివరకు 4,28,67,031 కేసులు, 5,12,622 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో 98.42 శాతంగా కరోన రికవరీ రేటు ఉంది. నిన్న కరోనా నుంచి 31,377 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 4,21,89,887 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Covid-19 : కరోనా వైరస్ నుండి బయటపడ్డా…. గుండెకు ముప్పే

భారత్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు 76.24 కోట్లు దాటాయని ఐసీఎంఆర్ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 11,83,438 టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 76,24,14,018 కరోనా టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 3298 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కరోనా టెస్టుల కోసం దేశవ్యాప్తంగా 1422 ప్రభుత్వ లాబ్స్,1876 ప్రైవేట్ లాబ్స్ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.