Covid-19 : కరోనా వైరస్ నుండి బయటపడ్డా…. గుండెకు ముప్పే

గుండె సంబంధ సమస్యలున్నవారికి మాత్రం ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్లు వారు తేల్చారు. ముఖ్యంగా వయస్సు పైబడిన వారిలో ఈ తరహా మరణాలు అధికంగా ఉంటున్నట్లు స్పష్టం చేశారు.

Covid-19 : కరోనా వైరస్ నుండి బయటపడ్డా…. గుండెకు ముప్పే

Virus (2)

Covid-19 : కరోనా వైరస్ గుండెపై తీవ్రప్రభావాన్ని చూపిస్తుంది. గుండెకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేకుండానే వైరస్ సోకిన వారిలో చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో కుప్పకూలిపోతున్నారు. ఇప్పటికే ఇదే విషయాన్ని అధ్యయనాలు సైతం ధృవీకరించాయి. వైరస్ ప్రభావం గుండె లోపల ఉండే కణాలపై పడుతుండటంతో ముప్పు ఏర్పడుతున్నట్లు వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధనలో తేలింది.

అదే క్రమంలో గతంలో ఎలాంటి గుండె సంబంధ సమస్యలు లేకపోయినా కరోనా వైరస్ సోకిన తర్వాత హృదయ కండరాలు ప్రభావితమవుతున్నట్లు చివరకు ప్రాణాంతకంగా మారుతున్నట్లు హ్యూస్టన్‌లోని టెక్సాస్ యూనివర్సిటీ హెల్త్ సైన్స్ సెంటర్ అధ్యయనంలో తేలింది. కరోనా వైరస్‌ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణమై, ఊపిరితిత్తుల దెబ్బతీస్తున్నాయని అంతా భావిస్తున్నప్పటికీ, వైరస్ ప్రభావం గుండెపై కూడా ఉంటున్నట్లు వారు గుర్తించారు.

గుండె సంబంధ సమస్యలున్నవారికి మాత్రం ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు తేల్చారు. ముఖ్యంగా వయస్సు పైబడిన వారిలో ఈ తరహా మరణాలు అధికంగా ఉంటున్నట్లు స్పష్టం చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు సైతం ఇతర వైరస్ లతో పోలిస్తే కరోనా వైరస్ దాడి చేయటం వల్ల గుండె పనితీరులో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. కరోనా వచ్చిపోయిందని, దాని నుండి బయటపడ్డామని చాలా మంది భావిస్తూ సాధారణ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే అంతర్లీనంగా వైరస్ ప్రభావం మాత్రం కొనసాగుతున్నట్లు అధ్యయనంలో తేలింది.