Vaccination మీ ఇష్టం, తర్వాత జ్వరం వచ్చే ఛాన్స్! Onlineలో రిజిస్ట్రేషన్

Covid Shot Voluntary, Says Government : భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వెల్లువెత్తుతున్న సందేహాలు, సమస్యలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. టీకా సమర్థత, భద్రతపై నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో..కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (Union Health Ministry) శుక్రవారం స్పందించింది. ప్రజల అనుమానాలను ప్రశ్న – జవాబు రూపంలో వెబ్ సైట్‌లో పొందుపరిచింది. దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ స్వచ్చందమేనని, టీకా వేసుకోవాలంటూ..తాము ఎవరినీ ఒత్తిడి చేయబోమని స్పష్టం చేసింది. అయితే..అందరూ టీకా వేసుకోవడం మంచిదని, కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు ఇతరులకు వైరస్ సోకకుండా..ఉండాలంటే..ప్రతొక్కరూ టీకా వేసుకోవాలని సూచించింది.
అంతా ఒకే అనుకున్న తర్వాతే :-
కరోనా వ్యాక్సిన్ వాడకం వల్ల..అంతా ఒకే అనుకున్నాకే..పంపిణీ చేపడుతామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. అన్ని అనుమతులు లభించాకే..దానిని ప్రజలకు అందిస్తామని వెల్లడించింది. 2.60 కోట్ల మందికి నవజాత శిశువులు, 2.90 కోట్ల మంది గర్భిణులకు టీకాలు వేయడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి అని పేర్కొంది. 50 ఏళ్లు పైబడిన వ్యక్తులు, 50 ఏళ్లలోపు అనారోగ్యాలతో ఉన్న వారికి కూడా ఇస్తారు. ఇక్కడ 50 ఏళ్లకు పైగా వయస్సు గల వారిని రెండు గ్రూపులుగా విభజించారు. ఉప గ్రూప్‌లో 60 ఏళ్లు అంతకంటే తక్కువ ఉన్న వారిని, రెండో ఉప గ్రూప్‌లో 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల వారిని చేర్చారు.
ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్ :-
ఇక టీకాలు వేయించుకోవాలని అనుకున్న వారు తప్పనిసరిగా ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోనే సమయంలో తప్పనిసరిగా ఫొటో ఉండాలి. ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన పాస్ బుక్, ఒటర్ ఐడీ, పెన్షన్ డ్యాక్యుమెంట్, పాన్ కార్డు, పాస్ పోర్టు తదితర వాటిల్లో ఏదో ఒకటి రిజిస్ట్రేషన్ సమయంలో ఎంట్రీ చేయాలి. అనంతరం లబ్దిదారుడి మొబైల్ నెంబర్ (Mobile Number) కు నిర్ణీత తేదీ, వ్యాక్సిన్ కేంద్రం ఉన్న ప్రదేశం, టీకా సమయం ఇతర వివరాలు SMS వస్తుంది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు క్యూ ఆర్ కోడ్ ఆధారిత సర్టిపికేట్ పంపుతారు.
మొదట వారికే :-
ఇక కరోనా వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం జ్వరం వచ్చే సూచనలున్నాయి. ఇంజక్షన్ చేసిన ప్రదేశంలో నొప్పి రావచ్చు. అరగంటపాటు టీకా కేంద్రంలో విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎదైనా సమస్యలు వస్తే..అధికారులు, ఆశా/ఏఎన్ఎంలకు తెలియచేయాలి. షెడ్యూల్ పూర్తి చేయడానికి ఓ వ్యక్తి రెండు డోసుల వ్యాక్సిన్‌ను 28 రోజుల వ్యవధిలో తీసుకోవాలి. కరోనా సోకిన వారికి టీకా వేయకూడదు. కోలుకున్న తర్వాత..14 రోజుల తర్వాత టీకా తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా టీకా వేసుకున్న తర్వాత..కూడా మాస్క్ (Mask)లు తప్పనిసరిగా ధరించాలి. చేతులు శుభ్రపరచుకోవాలి. భౌతిక దూరం పాటించాలి.
టీకా పంపిణీ ప్రారంభ దశలో మొదట ఈ వైరస్‌పై ముందుండి పోరాడుతున్న వారికి అందించనున్నారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు ముందుగా టీకా వేయనున్నారు. ఫ్రంట్ లైన్ కార్మికులకు కూడా ఇస్తారు. అనారోగ్యం, తీవ్రమైన అనారోగ్యం గల వ్యక్తులను సెకండరీ గ్రేడ్‌గా పరిగణిస్తారు.