Wastage Of Covid Vaccines: అధికారుల నిర్లక్ష్యం.. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు వ్యర్థం

దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. కరోనా టీకా తీసుకునేందుకు బారులు తిరుగుతున్నారు ప్రజలు. ఇంత డిమాండ్ ఉన్న టీకాలు కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయి.

Wastage Of Covid Vaccines: అధికారుల నిర్లక్ష్యం.. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు వ్యర్థం

Wastage Of Covid Vaccines

Updated On : June 9, 2021 / 12:34 PM IST

Wastage Of Covid Vaccines: దేశంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. కరోనా టీకా తీసుకునేందుకు బారులు తిరుగుతున్నారు ప్రజలు. ఇంత డిమాండ్ ఉన్న టీకాలు కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయి. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో 480 కోవిషీల్డ్‌ వ్యాక్సిన్లు గడ్డకట్టాయి. ఈ ఘటన బన్స్వారా జిల్లా రఘునాథపుర గ్రామంలో చోటుచేసుకుంది. ప్రజలకు ఇచ్చేందుకు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ( పీహెచ్‌సీ) టీకాలు తీసుకొచ్చారు. వాటిని పనిచేయని ఫ్రిజ్‌ లో పెట్టారు. ఫ్రిజ్‌ పనిచేయని విషయం ఆసుపత్రి సిబ్బందికి తెలిసినా పట్టించుకోకపోవడంతో 480 వ్యాక్సిన్లు గడ్డకట్టిపోయాయి.

ఈ విషయం చీఫ్‌ మెడికల్‌ హెల్‌ ఆఫీసర్‌ దృష్టికి వెళ్ళింది. మహేంద్ర పర్మర్‌ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల బృంధం పీహెచ్‌సీ కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్లను పరిశీలించారు. మొత్తం గడ్డకట్టి పాడైపోయినట్లు గుర్తించారు. దీనికి కారణమైన పీహెచ్‌సీ సిబ్బందికి నోటీసులు జారీచేశారు అధికారులు. అయితే గతంలో కూడా రాజస్థాన్ రాష్ట్రంలో చాలా టీకాలు నిరుపయోగమయ్యాయి, చెత్తబుట్టలో కూడా దర్శనమించాయి. కరోనా టీకాలను చెత్తబుట్టలో పడేయడంపై గతంలో రాజస్థాన్ ప్రభుత్వంపై కేంద్రం సీరియస్ అయింది.