Cow gratitude to man : తన డెలివరీకి సాయం చేసిన వ్యక్తిపై అభిమానం చాటుకున్న గోవు..నెటిజన్ల మనసు దోచుకున్న వీడియో

మనుషులు సాయం చేస్తే మూగజీవాలు ఎంతో కృతజ్ఞత చాటుకుంటాయి. తన ప్రసవ సమయంలో సాయం చేసిన ఓ వ్యక్తి పట్ల ఆ ఆవు చూపించిన కృతజ్ఞత మనసుని హత్తుకుంటుంది.

Cow gratitude to man : తన డెలివరీకి సాయం చేసిన వ్యక్తిపై అభిమానం చాటుకున్న గోవు..నెటిజన్ల మనసు దోచుకున్న వీడియో

Cow gratitude to man

Updated On : June 23, 2023 / 1:49 PM IST

Cow gratitude to man : జంతువులు మూగజీవాలే కానీ వాటికి ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. మనుష్యులు వాటికి సాయం చేస్తే అవి కృతజ్ఞత చాటుకుంటాయి. తన ప్రసవ సమయంలో సాయం చేశాడని ఓ వ్యక్తి పట్ల ఓ ఆవు ఎంత అభిమానం చాటుకుందో చూస్తే ఫిదా అవుతారు.

Karnataka : చిరుత దాడి నుంచి యజమానిని కాపాడిన ఆవు, శునకం

ఆవుకి అప్పుడే చిన్న దూడపిల్ల పుట్టింది. అది ప్రసవ వేదన పడుతుంటే ఓ వ్యక్తి సాయం చేశాడు. అందుకు కృతజ్ఞతగా అతని చేతులు, నుదురు నిమురుతూ ఆ ఆవు తన అభిమానాన్ని చాటుకుంది. ఆ ఆవు దూడకి దుప్పటి కప్పడానికి ప్రయత్నిస్తుంది. అతను తిరిగి దూడను గుడ్డతో శుభ్రం చేస్తుంటే మరల అతని చేతులు నాకుతూ.. నిమురుతూ తన ప్రేమను,కృతజ్ఞతను చాటుకుంది. ఈ క్యూట్ వీడియో అందరి మనసుని హత్తుకుంది.

Rajasthan farmer cow calf : ఆవు కోసం ఆరెకరాలు అమ్మి రైతన్న అలుపెరగని పోరాటం .. దూడ కోసం డీఎన్ఏ టెస్ట్ చేయించి తల్లీ బిడ్డల్ని కలిపిన కథ

ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘ అందమైన బంధం’ అని .. ‘ ఈ వీడియో చూసాక ఆవుల పట్ల ప్రేమ పెరిగింది’ అని వరుసగా కామెంట్లు చేశారు. మనుష్యులే ఒక్కోసారి చేసిన సాయం మర్చిపోతారేమో కానీ మూగజీవులు మనుష్యులు చేసిన సాయాన్ని మర్చిపోవని.. వారి పట్ల ఎంతో కృతజ్ఞతాభావంతో ఉంటాయని చాలామంది అభిప్రాయపడ్డారు.