CoWin : విదేశాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్, కొవిన్‌లో కొత్త ఫీచర్ వస్తోంది

టీకా ధృవపత్రంపై సందిగ్ధతలు నెలకొంటున్నాయి. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ప్రమాణాల విషయంలో...ఇటీవలే...భారత్, బ్రిటన్ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.

CoWin : విదేశాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్, కొవిన్‌లో కొత్త ఫీచర్ వస్తోంది

Covin

Updated On : September 25, 2021 / 7:41 PM IST

CoWin Certificates : విదేశాలకు వెళ్లే వారికి నిజంగానే ఇదొక గుడ్ న్యూసే అని చెప్పాలి. కరోనా కారణంగా…వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే..కొన్ని దేశాలు ఆంక్షలు, నిబంధనలు విధిస్తున్నాయి. రాకపోకల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. టీకా ధృవపత్రంపై సందిగ్ధతలు నెలకొంటున్నాయి. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ప్రమాణాల విషయంలో…ఇటీవలే…భారత్, బ్రిటన్ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ దేశానికి వెళ్లే వారి ధృవపత్రంలో వ్యక్తి వయస్సు మాత్రమే నమోదవుతోంది.

Read More : Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ పై సందేహాలు, సమస్య వస్తే ఏం చెయ్యాలి.. కంపెనీ ఏం చెబుతోంది?

WHO నిబంధనలకు అనుగుణంగా పుట్టిన తేదీతో కూడిన టీకా సర్టిఫికేట్లు వచ్చే వారం నుంచి..అందుబాటులోకి తేవాలని యోచిస్తోందని తెలుస్తోంది. పూర్తి పుట్టిన తేదీ పొందుపరిచిన కొవిన్ సర్టిఫికేట్లు జారీ చేయనున్నట్లు సమాచారం. కొవిన్ యాప్ లో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకోవడం జరిగిందని, భారత్ లో తయారు చేసిన కొవిషీల్డ్ టీకాతో తమకు ఎలాంటి సమస్య లేదని…వ్యాక్సిన్ సర్టిఫికేట్ తోనే సమస్య ఉందని ఇటీవలే బ్రిటన్ ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయంలో…కొవిన్ యాప్, ఎన్ హెచ్ఎస్ యాప్ రూపకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు బ్రిటన్ హై కమిషనర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.