CoWIN 14 Languages : హిందీ సహా 14 ప్రాంతీయ భాషల్లో ‘CoWIN’ యాప్
కొవిడ్ టీకా పొందేందుకు కేంద్రం తీసుకువచ్చిన కోవిన్ పోర్టల్ ప్రజలకు మరింత చేరువకానుంది. ఈ యాప్ వచ్చే వారం నుంచి హిందీ, మరో 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానుందని కేంద్రం తెలిపింది.

Cowin Portal In Hindi, 14 Regional Languages By Next Week
CoWIN portal 14 regional languages : కొవిన్ పోర్టల్ వచ్చే వారం నాటికి హిందీ, 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది. కొవిడ్ -19 వేరియంట్లను పర్యవేక్షించడానికి మరో 17 ల్యాబరేటరీలను ఇన్సాకోగ్ నెట్‌వర్క్‌కు చేర్చనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ అధ్యక్షతన సోమవారం జరిగిన COVID-19 పై ఉన్నత స్థాయి మంత్రుల బృందం (GoM) 26వ సమావేశంలో ఈ నిర్ణయాలు ప్రకటించినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
పరీక్షించిన శాంపిల్స్ సంఖ్యను పెంచడానికి, మరింత ప్రాదేశిక విశ్లేషణకు అనుమతించడానికి 17 కొత్త ల్యాబరేటరీలను ఇన్సాకోగ్ నెట్‌వర్క్‌కు చేర్చబోతున్నామని హర్షవర్ధన్ తెలిపారు. ఈ నెట్‌వర్క్ ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 10 ల్యాబరేటరీల ద్వారా సేవలు అందిస్తోంది. భారతదేశం కొత్త COVID-19 కేసులు 26 రోజుల తరువాత మొదటిసారిగా మూడు లక్షల కన్నా తక్కువకు తగ్గిపోయాయి. గత 24 గంటల్లో 1,01,461 కేసులు నమోదయ్యాయి.