Gurugram Video : బాబోయ్.. మరణం ఇలాకూడా ఉంటుందా..! వీడియో వైరల్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. నలుగురు వ్యక్తులు, ఓ మైనర్ బాలిక స్మశాన వాటిక గోడ పక్కన కుర్చీల్లో కూర్చున్నారు. పక్కన ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు.

Gurugram Video : బాబోయ్.. మరణం ఇలాకూడా ఉంటుందా..! వీడియో వైరల్

Gurugram wall collapse

Updated On : April 21, 2024 / 12:46 PM IST

Gurugram wall collapse Video : మృత్యువు ఏ రూపంలో కబళిస్తుందో ఎవరూ ఊహించలేరు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులుసైతం కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కొందరు.. నిద్రలోనే మరికొందరు.. ఇలా అనేక మంది ఉన్నట్లుండి మృత్యువు భారిన పడిన ఘటనలు మనం విన్నాం. తాజాగా.. ఒక్కసారిగా గోడకూలి నిమిషాల్లో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. హర్యానాలోని గురుగ్రామ్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్మశాన వాటిక గోడ ఒక్కసారిగా కూలి ఐదుగురు మరణించారు. మృతుల్లో ఓ మైనర్ బాలిక కూడా ఉంది. అందరూ చూస్తుండగానే గోడకూలడం.. గోడపక్కన ఉన్నవారు మరణించడం నిమిషాల్లో జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో.. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శనివారం సాయంత్రం 6.20 గంటల సమయంలో అర్జున్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Also Read : Jhalawar Road Accident : పెళ్లి బృందం వ్యాన్ ను ఢీకొట్టిన ట్రక్కు.. తొమ్మిది మంది మృతి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. నలుగురు వ్యక్తులు, ఓ మైనర్ బాలిక స్మశాన వాటిక గోడ పక్కన కుర్చీల్లో కూర్చున్నారు. పక్కన ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. వీరంతా ఏదో విషయంపై మాట్లాడుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. ఈ సమయంలో ఉన్నట్లుండి గోడ ఒక్కసారిగా కూలిపోయింది. గోడపక్కన ఉన్నవారు తప్పించుకొనేందుకు ప్రయత్నించినా అవకాశం లేకుండాపోయింది. దీంతో నలుగురు వ్యక్తులు, ఓ మైనర్ బాలిక గోడ శిథిలాల కింద చిక్కుకు పోయారు. చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొని శిథిలాల కింద చిక్కుకొని గాయపడ్డ వారిని గురుగ్రామ్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పప్పు, కృష్ణ, మనోజ్, ఖుష్బూ అనే మైన బాలిక చికిత్స పొందుతూ మృతిచెందారు. గురుగ్రామ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Choclates : బాబోయ్.. చాక్లెట్లు తిని రక్తం కక్కుకుని చిన్నారి మృతి.. అసలేం జరిగిందో తెలిస్తే షాకే