Krishna River : నదిలో నీళ్లు తాగుతున్న వ్యక్తిని లాక్కెళ్లిన మొసలి

నదిలో నీటిని తాగేందుకు వెళ్లిన వ్యక్తిపై మొసలి దాడిచేసి నీటిలోకి లాక్కెళ్ళింది. ఈ ఘటన కర్ణాటకలోని యాద్గిరి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.

Krishna River : నదిలో నీళ్లు తాగుతున్న వ్యక్తిని లాక్కెళ్లిన మొసలి

New Project (4)

Updated On : November 26, 2021 / 6:36 PM IST

Krishna River :  నదిలో నీటిని తాగేందుకు వెళ్లిన వ్యక్తిపై మొసలి దాడిచేసి నీటిలోకి లాక్కెళ్ళింది. ఈ ఘటన కర్ణాటకలోని యాద్గిరి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. వెంకటేష్(40) అనే రైతు మరికొందరితో కలిసి కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. దాహం వేయడంతో నీరు తాగేందుకు కృష్ణానది వద్దకు వెళ్ళాడు. నీరు తాగుతున్న సమయంలో మొసలి అతడిని నోటకరిచి లోపలికి లాక్కెళ్ళింది. అతడి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకునే లోపే వెంకటేష్‌ను నీళ్ళల్లోకి లాక్కెళ్లిపోయింది.

చదవండి : Krishna River Water : తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం

నీటిపై రక్తం కనిపించడంతో మొసలి లాక్కెళ్ళింది నిర్దారణకు వచ్చి వెంటనే పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు, వారు ఘటనాస్థలికి చేరుకొని గాలింపు చేపట్టారు. చీకటిపడటంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం నదివద్దకు వచ్చే సరికి వెంకటేష్ మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. మృతదేహం స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి బందువులకు అప్పగించారు.

చదవండి : Crocodile : చేపలు పడుతుంటే బాలుడ్ని లాక్కెళ్లిన మొసలి