Petrol Price : పెట్రోల్, డీజిల్ ధరలపై బిగ్ అప్డేట్.. మరో 10 రోజుల్లో గుడ్న్యూస్? ముడి చమురు ధరలతో కొత్త ఆశలు
Petrol Price : మరో వారం నుంచి 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై చమురు మార్కెటింగ్ కంపెనీలు బ్రేక్ఈవెన్ (లాభనష్టాలు లేకుండా) స్థితికి చేరుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Petrol Price
Petrol Price : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే కొనసాగితే.. మరో వారం నుంచి 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై చమురు మార్కెటింగ్ కంపెనీలు బ్రేక్ఈవెన్ (లాభనష్టాలు లేకుండా) స్థితికి చేరుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, వంట గ్యాస్ సిలిండర్ విక్రయంపై మాత్రం ఇప్పటికీ ఒక్కో సిలిండర్ కు సుమారు రూ.500 వరకు నష్టం వస్తోందని సమాచారం.
Aslo Read : Russia Ukraine Bioweapon Allegation : రష్యాపై యుక్రెయిన్ సంచలన ఆరోపణలు.. ‘బయోవెపన్’ ముప్పు సృష్టిస్తోందా..?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ చమురు శుద్ధి సంస్థలు రూ.75 వేల కోట్లకు పైగా నష్టాలను చవిచూశాయి. గతంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన ముడి చమురు నిల్వలు ఇంకా ఉండటంతో, ఈ త్రైమాసికంలో కూడా వాటి ఆర్థిక ఫలితాలపై ఒత్తిడి కొనసాగే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మార్కెట్ పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై సమీక్ష నిర్వహించేందుకు సౌదీ అరేబియా, రష్యా నేతృత్వంలోని ఏడు ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు వర్చువల్ సమావేశం నిర్వహించాయి. నివేదికల ప్రకారం, పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి ఈ దేశాలు తమ ఉత్పత్తి కోటాలను రోజుకు 9.4 లక్షల బ్యారెళ్ల (940,000 బ్యారెల్స్ పర్ డే) మేర పెంచాయి. ఇది ప్రపంచ చమురు డిమాండ్లో దాదాపు 1 శాతానికి సమానం.
అమెరికా – ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్ పై ఏర్పడిన ఉద్రిక్తతలతో హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్ దేశాల నుంచి ఎగుమతి అయ్యే ముడి చమురు ప్రధానంగా ఈ మార్గం ద్వారానే ప్రపంచ మార్కెట్ కు చేరుతుంది. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతుకుపైగా ఈ జలసంధి ద్వారానే రవాణా అయ్యేది. అయితే, డాలర్లలో చెల్లింపులు చేసి డాలర్లలో కొనుగోలు చేయగలిగితే ఇరాన్ ముడి చమురు అందుబాటులోకి రావడం, అలాగే వెనెజువెలా నుంచి కూడా చమురు సరఫరా పెరగడం వల్ల అనేక దేశాలపై ఒత్తిడి కొంతమేర తగ్గిందని నిపుణులు పేర్కొంటున్నారు.
తాజాగా విశ్లేషకులు మాట్లాడుతూ.. ఏడు దేశాల ఈ కూటమి ఉత్పత్తి కోతలను దశలవారీగా ఎత్తివేయడం ముందుగానే ఊహించిన పరిణామమే. అయితే సమీప భవిష్యత్తులో హోర్ముజ్ జలసంధి గుండా ఎంతమంది చమురు ట్యాంకర్లు సురక్షితంగా ప్రయాణించగలుగుతాయి? అలాగే ప్రపంచ డిమాండ్, ముఖ్యంగా చైనా ముడి చమురు దిగుమతులు ఎంత వేగంగా పుంజుకుంటాయనేదే మార్కెట్ దృష్టిలో కీలక అంశం అని పేర్కొంన్నారు.
