Russia Ukraine Bioweapon Allegation : రష్యాపై యుక్రెయిన్ సంచలన ఆరోపణలు.. ‘బయోవెపన్’ ముప్పు సృష్టిస్తోందా..?
Russia Ukraine Bioweapon Allegation : రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో ప్రమాదకరమైన ఆంత్రాక్స్ సోకిన పశువుల కళేబరాలను ఉద్దేశపూర్వకంగా పాతిపెడుతూ జీవ ఆయుధ ముప్పును సృష్టిస్తోందని యుక్రెయిన్ ఆరోపణలు చేసింది.
Russia Ukraine Bioweapon Allegation
Russia Ukraine Bioweapon Allegation : రష్యాపై యుక్రెయిన్ సంచలన ఆరోపణలు చేసింది. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో ప్రమాదకరమైన ఆంత్రాక్స్ (Anthrax) సోకిన పశువుల కళేబరాలను ఉద్దేశపూర్వకంగా పాతిపెడుతూ జీవ ఆయుధ (Bioweapon) ముప్పును సృష్టిస్తోందని యుక్రెయిన్ పేర్కొంది. దీనివల్ల ప్రజారోగ్యానికి, పర్యావరణానికి తీవ్రమైన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని యుక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆందోళణ వ్యక్తం చేశారు.
Also Read : Andhra Pradesh : ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈనెల 10తరువాత వారి బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు..
యుక్రెయిన్ సైనిక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ప్రకారం.. రష్యా ఆక్రమిత ఖెర్సన్ (Kherson) ప్రాంతంలో ఆంత్రాక్స్ (సిబిరియన్ అల్సర్) వ్యాధితో బాధపడిన పశువుల మృతదేహాలను సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా పాతిపెడుతోంది. ఇది బయోలాజికల్ టెర్రరిజం లాంటి చర్యగా పేర్కొంది. వ్యవసాయం, నేల, నీరు, జంతువులకు తీవ్రమైన ప్రమాదం కలిగిస్తుందని హెచ్చరించింది.
రష్యా ఆక్రమిత ఖెర్సన్ ప్రాంతంలో ఆంత్రాక్స్ బాధిత పశువుల మృతదేహాలను రవాణా చేసి సుమారు 50 పశు ఖనన స్థలాల్లో పాతిపెడుతోంది. వీటిలో సుమారు 10 ప్రాంతాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. అస్కానియా- నోవా (Askania-Nova), స్కడోవ్స్క్ (Skadovsk), జలిజ్నీ పోర్ట్ (Zalizny Port) వంటి ప్రాంతాల సమీపంలో ఇవి ఉన్నాయి. సరైన పారిశుద్ధ్య ప్రమాణాలు పాటించకుండా, మృతదేహాలను దహనం చేయకుండా నేరుగా పాతిపెడుతున్నారు. చాలా ఖనన ప్రదేశాలు రోడ్లు, నివాస ప్రాంతాల సమీపంలో ఉన్నాయి. కొన్ని నివాసాల నుంచి ఒక కిలోమీటరు కంటే తక్కువ దూరంలో ఉన్నాయి. ఈ పశు ఖనన స్థలాలు సరైన కంచెలు, రక్షణ చర్యలు లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నాయని యుక్రెయిన్ సైనిక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొంది.
ఆంత్రాక్స్ సోకిన పశువుల కళేబరాలను పాతిపెట్టడం వల్ల నేల, నీటి వనరులు కలుషితమై, వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని యుక్రెయిన్ ఆరోపించింది. రష్యా చేస్తున్న ఈ చర్యలను జీవ ఉగ్రవాదంతో సమానంగా పరిగణించాలని అంతర్జాతీయ సమాజాన్ని యుక్రెయిన్ కోరింది. ఇది అక్రమిత ప్రాంతాల్లోని పౌరులపై బయోలాజికల్ టెర్రరిజం అని ఆరోపించింది. రష్యా తర్వాత ఈ సమాధులను ఉపయోగించి ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసి యుక్రెయిన్ పై బయోలాజికల్ వెపన్స్ ఉపయోగించిందని ఆరోపించవచ్చునని హెచ్చరించింది. రష్యా చర్య స్థానిక ప్రజలు, వ్యవసాయం, నేల, నీరు, జంతువులకు తీవ్రమైన ప్రమాదం కలిగిస్తుందని పేర్కొంది.
