కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ : డీఏ 3 శాతం పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు. డీఏను 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 02:45 AM IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ : డీఏ 3 శాతం పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు. డీఏను 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు. డీఏను 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయంతో దేశంలో 1.1 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి పెంపు అమల్లోకి రానుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఫిబ్రవరి 19 మంగళవారం నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ప్రస్తుతం 9 శాతం డీఏ అమల్లో ఉండగా, దీనికి అదనంగా మరో 3 శాతం పెంచారు. డీఏ పెంపుతో 48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 62.03 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం చేకూరనుంది. తాజా పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వంపై ఏటా రూ.9,168 కోట్ల భారం పడుతుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.