UP Election 2022: యూపీలో దళితులే కింగ్ మేకర్స్.. బీఎస్‌పీ మ్యాజిక్ చేస్తుందా? పూర్తి లెక్కలు ఇవే!

UP Election 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో దళితుల కోసం ప్రత్యేకమైన హామీలు గుప్పిస్తున్నాయి అక్కడి రాజకీయ పార్టీలు.

UP Election 2022: యూపీలో దళితులే కింగ్ మేకర్స్.. బీఎస్‌పీ మ్యాజిక్ చేస్తుందా? పూర్తి లెక్కలు ఇవే!

UP Election 2022 Poll of Polls

UP Election 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో దళితుల కోసం ప్రత్యేకమైన హామీలు గుప్పిస్తున్నాయి అక్కడి రాజకీయ పార్టీలు. దళిత వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తుండగా.. ఈ ఎపిసోడ్‌లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పెద్ద నాయకులు దళితుల ఇళ్లకు వెళ్లి భోజనం చేయడం చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో దళితుల ఓటు ఎందుకు ముఖ్యమైనదిగా పరిగణిస్తారు? రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి దళితుల ఓట్లే ముఖ్యమా? ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో జరగబోయే ఎన్నికలు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ నుంచి ప్రారంభం అవుతున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో గణాంకాల ప్రకారం 21 శాతానికి పైగా దళిత ఓటర్లు ఉన్నారు.

ఈ ప్రాంతంలో ప్రతీ ఐదుగురు ఓటర్లలో ఒకరు దళిత సమాజం నుంచి వచ్చినట్లే లెక్క. అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో గెలుపు ఓటములను నిర్ణయించడంలో దళిత ఓటర్లదే పెద్ద పాత్ర.. గత ఎన్నికల ఫలితాలు అదే చెబుతున్నాయి.

1993లో దళితుల ఓట్లతో అద్భుతం జరిగింది..
ఉత్తరప్రదేశ్ గురించి చెప్పాలంటే, పెద్ద సంఖ్యలో దళిత ఓటర్లు బహుజన్ సమాజ్ పార్టీతో ఉన్నట్లుగా నమ్ముతారు. 1993లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఏర్పడినప్పటి నుంచి దళిత ఓటర్లు పెద్దఎత్తున బీఎస్‌పీతో కలిసి నడుస్తున్నారు. 1993లో బీఎస్పీ వెలుగులోకి వచ్చిన ఏడాదిలో ఆ పార్టీకి 11.12 శాతం ఓట్లు రాగా, ఆ పార్టీకి 67 సీట్లు వచ్చాయి. దీని తర్వాత 1996 ఎన్నికల్లో బీఎస్పీకి 19.64 శాతం ఓట్లు వచ్చాయి. అప్పుడు కూడా బీఎస్పీ 67 స్థానాలను కైవసం చేసుకుంది.

2002 ఎన్నికల్లో BSP..
2002 అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఓట్ల శాతం 23.06కు చేరుకోగా.. 98 సీట్లు గెలుచుకుంది. 2007లో బీఎస్పీ పూర్తి మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, ఆ సమయంలో బీఎస్పీకి 30.43 శాతం ఓట్లు వచ్చాయి. మొత్తం 206 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే, 2007 ఎన్నికలలో, దళితులతో పాటు బ్రాహ్మణ ఓట్లను సాధించుకోవడంలో మాయావతి విజయం సాధించారు. దీని ఫలితంగా ఓట్ల శాతం.. సీట్లూ పెరిగాయి.

2012లో 80 సీట్లకే పరిమితమైన BSP:
2012 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీకి 25.95 శాతం ఓట్లు రాగా, బీఎస్పీ 80 సీట్లకు పడిపోయింది. 2017 ఎన్నికల్లో బీఎస్పీకి 22.24 శాతం ఓట్లు మాత్రమే రాగా.. మాయావతి పార్టీ 19 సీట్లకు పడిపోయింది. అయితే దళితుల పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న బహుజన సమాజ్ పార్టీకి తర్వాతి కాలంలో ఆశించిన ఫలితాలు రాలేదు.

దళితుల ఓట్ల విభజన:
దళితుల ఓట్లు ఉపకులాల వారీగా విభజించబడ్డాయి. ఉదాహరణకు జాతవ్, పాసి, వాల్మీకి. అనే మూడు ఉపకులాలు ఇక్కడ ముఖ్యమైనవి. జాతవ్ కమ్యూనిటీ నుంచి 55 శాతానికి పైగా ఓట్లు వస్తాయని నమ్ముతున్నప్పటికీ, ఈ జాతవ్ కమ్యూనిటీ ఎప్పుడూ మాయావతి పార్టీ BSP తోనే ఉంది. 2017 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, అక్కడ మాయావతి పార్టీ 19 సీట్లకు తగ్గిపోయింది. కానీ ఓట్ల శాతంలో ఆమె కంటే ఎక్కువ సీట్లు వచ్చిన SP కంటే ఆమె ముందు ఉంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి 21.8% ఓట్లు రాగా.. అదే సమయంలో ఈ ఎన్నికల్లో బీఎస్పీకి దాదాపు 22.2 శాతం ఓట్లు వచ్చాయి.

ఉత్తరప్రదేశ్ దళితుల రాజధాని:
ఉత్తరప్రదేశ్‌లోని దళితుల రాజధానిగా పిలువబడే ఆగ్రా జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2007 అసెంబ్లీ ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ 9 స్థానాలకు 7 గెలుచుకుంది. 2012లో బహుజన్ సమాజ్ పార్టీ ఆగ్రా జిల్లాలోని 9 అసెంబ్లీ స్థానాల్లో 6 గెలుచుకుంది. 2017 నాటికి, బహుజన్ సమాజ్ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ఫలితంగా 2017 అసెంబ్లీ ఎన్నికలలో, 9 అసెంబ్లీ స్థానాల్లో 9 స్థానాలను BJP గెలుచుకుంది.

దళితుల ఓటు బ్యాంకు రాబట్టుకున్న బీజేపీ:
2017 అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి ప్రధాన ఓటర్‌గా భావించే దళితుల ఓట్లను బీజేపీ చేజిక్కించుకుంది. మాయావతి పార్టీ నుంచి బీజేపీ దళితుల ఓట్లు ఎక్కువగా రాబట్టుకోవడంతో.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 325 సీట్లు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో కూడా మాయావతి పార్టీ నుంచి ఓట్లను చీల్చేందుకు బీజేపీ వ్యూహం సిద్ధం చేసుకుంది. బీజేపీ ప్లాన్ వర్కౌట్ అయ్యి.. దళితుల ఓట్లు బీజేపీ వైపు వెళ్తే వారికి విజయం పెద్ద కష్టమేం కాదు.