అగ్ర కుల అమ్మాయితో మాట్లాడినందుకు దళితుడికి అరగుండు కొట్టారు

  • Published By: vamsi ,Published On : February 24, 2020 / 12:25 PM IST
అగ్ర కుల అమ్మాయితో మాట్లాడినందుకు దళితుడికి అరగుండు కొట్టారు

Updated On : February 24, 2020 / 12:25 PM IST

భరతమాత దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొంది దశాబ్దాలు దాటిపోయింది. అయినా కూడా ఇంకా దేశంలో అక్కడక్కడా అర్థ శతాబ్దం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని ఇంక మెదడుల నుంచి తొలిగించుకుండా బతికేస్తున్నారు. లేటెస్ట్‌గా రాజస్థాన్‌లోని జోథ్ పూర్‌లో జరిగిన ఘటన అసలు మానవత్వం అనేది బతికే ఉందా? అనుమానం తెచ్చేలా చేస్తుంది. 

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో ఒక ప్రత్యేక కులానికి చెందిన కొద్దిమంది రాహుల్ మేఘ్వాల్‌ అనే 20ఏళ్ల దళిత వ్యక్తిని కొట్టారు. కొట్టడమే కాదు అర గుండు కూడా కొట్టారు. ఎందుకంటే రాహుల్ ఒక అగ్ర కులానికి చెందిన ఓ అమ్మాయిని కలిశాడనే కారణంతో రాహుల్‌ని దారుణంగా కొట్టారు. అరగుండు చేయించారు.

మోటార్ సైకిళ్లు రిపేర్ చేసుకునే రాహుల్.. జోధ్ పూర్‌లోని బాల్‌దేవ్ నగర్‌లో ఉంటున్నాడు. అతనికి ఉన్నత కులానికి చెందిన ఓ అమ్మాయితో కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ క్రమంలోనే రాహుల్ సినిమా హాల్‌కి దగ్గరలోని ఓ కేఫ్ దగ్గర కలిశాడు. అయితే అది చూసిన అమ్మాయి తరుపు కులం వారు. రాహుల్‌ని కొట్టి అరగుండు గీశారు.

Dalit’s Head Shaved

రాహుల్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఇనుప కడ్డీలతో కొట్టడం, తలపై బలవంతంగా గుండు కొట్టడం వంటివి చేసినందుకు సెక్షన్లు 323, 341 , 342 మరియు 143 సెక్షన్ల కింద ఎస్సీ/ఎస్టీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితులపై జోధ్ పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. రాహుల్ తండ్రి సునీల్‌ను పిలిచి, కేసు పెట్టొద్దని కూడా నిందితులు బెదిరించారు.

Dalit’s Head Shaved

నిందితుల్లో ఏడుగురు మగవాళ్లు ఉండగా.. ముగ్గురు ఆడవాళ్లు ఉన్నట్లుగా పోలీసులు కేసులు పెట్టారు.