Muzaffarnagar Incident: రెండేళ్లుగా లైంగిక దాడి.. మామ మర్మాంగాన్ని కోసేసిన కోడలు.. యూపీలో షాకింగ్ ఘటన
ఉత్తరప్రదేశ్(Muzaffarnagar Incident)లో రెండేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడనే ఆరోపణలతో మామపై కోడలు బ్లేడుతో దాడి చేసి మర్మాంగాన్ని కోసేసింది.
Daughter in law severs genitals of father in law who had been sexually assaulting her for two years.
- మామ మర్మాంగాన్ని కోసేసిన కోడలు.
- రెండేళ్లుగా లైంగిక వేధింపుల నరకం.
- రక్తపు మడుగులో వృద్ధుడి పరిస్థితి.
Muzaffarnagar Incident: ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. గత రెండేళ్లుగా తనపై నిరంతరం లైంగిక దాడికి పాల్పడుతున్నాడనే ఆరోపణలతో 67 ఏళ్ల మామపై 23 ఏళ్ల కోడలు బ్లేడుతో దాడి చేసి మర్మాంగాన్ని కోసేసింది. బుధానా(Muzaffarnagar Incident) పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫీపూర్ పట్టి గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ షాకింగ్ ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితురాలు సయ్యదా(23) భర్త ఉపాధి కోసం హర్యానాలో ఆటో నడుపుతూ అక్కడే ఉంటున్నాడు. దీంతో ఆమె తన ఇద్దరు పిల్లలు, మామ జాకిర్(67)తో కలిసి ముజఫర్నగర్లో నివసిస్తోంది. ఈ క్రమంలో ఒంటరిగా ఉంటున్న కోడలిపై కన్నేసిన మామ, గత రెండేళ్లుగా ఆమెను తీవ్ర లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ నరకం భరించలేక సయ్యదా ఇరుగుపొరుగు వారికి మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో, విసిగిపోయిన ఆమె శుక్రవారం ఈ తీవ్రమైన చర్యకు పాల్పడింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, రక్తపు మడుగులో ఉన్న జాకిర్ను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో అతడిని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. నిందితురాలు సయ్యదాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతానికి ఇరు వర్గాల నుంచి ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందిన వెంటనే పూర్తి సాక్ష్యాధారాలతో కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బుధానా సర్కిల్ ఆఫీసర్ గజేంద్ర పాల్ సింగ్ వెల్లడించారు.
