Government Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 18 మంది మృతి

మృతుల్లో 12 మంది వయసు 50 ఏళ్లపైనే ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారని వివరించారు.

Government Hospital: ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 18 మంది మృతి

Maharashtra

Updated On : August 13, 2023 / 7:48 PM IST

Government Hospital – Thane: మహారాష్ట్ర(Maharashtra)లోని థానె ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 18 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ హాస్పిటల్లో చోటు చేసుకున్న ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ… మృతుల్లో పది మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారని చెప్పారు.

మృతుల్లో 12 మంది వయసు 50 దాటి ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారని వివరించారు. ఆరోగ్య సేవల కమిషనర్ల ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతుందని అన్నారు. మరణాల వెనుక ఉన్న వైద్య పర అంశాలపై విచారణ జరుపుతారని చెప్పారు.

పలు అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరి 18 మంది చనిపోయారని అన్నారు. వారిలో కొందరికి కిడ్నీల్లో రాళ్లు, దీర్ఘకాలిక పక్షవాతం, అల్సర్లు, న్యుమోనియా వంటి వ్యాధులు ఉన్నాయని తెలిపారు. థానె ఆసుపత్రిలో చోటుచేసుకున్న మరణాలపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు.

Group 2 Exam : గ్రూప్ 2 పరీక్ష రాసే అభ్యర్థులకు బిగ్ రిలీఫ్.. కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్ పీఎస్సీ