స్కూల్‌లో తోటి విద్యార్థితో గొడవపడ్డ బాలుడు.. అతడు బడి బయటకు రాగానే కత్తిపోట్లు.. మృతి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో స్పెషల్‌ క్లాస్‌ సమయంలో తొమ్మిదో తరగతి విద్యార్థి ఇషు గుప్తా మరో విద్యార్థి కృష్ణతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు.

స్కూల్‌లో తోటి విద్యార్థితో గొడవపడ్డ బాలుడు.. అతడు బడి బయటకు రాగానే కత్తిపోట్లు.. మృతి

Updated On : January 4, 2025 / 8:17 PM IST

ఢిల్లీలోని ఓ పాఠశాల బయట 14 ఏళ్ల విద్యార్థి కత్తిపోట్టకు గురై ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఢిల్లీలోని షకర్‌పూర్ ప్రాంతంలోని రాజ్కీయ సర్వోదయ బాల విద్యాలయ నంబర్ 2 స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో స్పెషల్‌ క్లాస్‌ సమయంలో తొమ్మిదో తరగతి విద్యార్థి ఇషు గుప్తా మరో విద్యార్థి కృష్ణతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. క్లాస్ ముగిసిన తర్వాత కృష్ణ, మరో ముగ్గురు నలుగురు వ్యక్తులతో కలిసి స్కూల్‌ బయట ఇషు గుప్తాపై దాడి చేయడానికి ప్రణాళిక వేసుకున్నాడు.

క్లాస్‌ అయిపోగానే ఇషు గుప్తా కోసం కృష్ణ, మరో నలుగురితో స్కూల్‌ బయట వేచిచూశాడు. ఇషు గుప్తా బయటకు రాగానే అతడిపై కృష్ణ దాడి చేశాడు. ఇషు గుప్తాను కృష్ణ, అతడి మరో నలుగురు స్నేహితులు పొడిచి పారిపోయినట్లు తెలుస్తోంది.

ఇషు గుప్తా తొడపై పొడిచిన గాయాలు కనపడ్డాయి. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేశారు. వారిలో ఐదుగురు మైనర్లు.

40 సింహాలు ఉండే అడవిలో తప్పిపోయిన ఏడేళ్ల పిల్లాడు.. 5 రోజులు ఫారెస్ట్‌లోనే.. చివరకు ఏం జరిగిందో తెలుసా?