40 సింహాలు ఉండే అడవిలో తప్పిపోయిన ఏడేళ్ల పిల్లాడు.. 5 రోజులు ఫారెస్ట్‌లోనే.. చివరకు ఏం జరిగిందో తెలుసా?

ఐదు రోజుల పాటు ఆ చిన్నారి పండ్లు తింటూ, చిన్న చిన్న బావులు తొవ్వుతూ అందులో వచ్చిన నీటిని తాగుతూ బతికాడు.

40 సింహాలు ఉండే అడవిలో తప్పిపోయిన ఏడేళ్ల పిల్లాడు.. 5 రోజులు ఫారెస్ట్‌లోనే.. చివరకు ఏం జరిగిందో తెలుసా?

Updated On : January 4, 2025 / 7:47 PM IST

క్రూర మృగాలు ఉండే దట్టమైన అడవుల్లో ఏడేళ్ల ఓ పిల్లాడు తప్పిపోయాడు. అడవిలో నుంచి బయటకు ఎలా రావాలో తెలియక అందులోనే ఐదు రోజుల పాటు ఉండిపోయాడు. ఉత్తర జింబాబ్వేలోని రెయిన్‌ఫారెస్ట్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆ అడవిలో సింహాలు, ఏనుగుల వంటివి కూడా ఉంటాయి. ఐదు రోజుల పాటు ఆ చిన్నారి పండ్లు తింటూ, చిన్న చిన్న బావులు తొవ్వుతూ అందులో వచ్చిన నీటిని తాగుతూ బతికాడు. టినోటెండా అనే బాలుడు డిసెంబర్ 27న ఉత్తర జింబాబ్వేలోని తన గ్రామం నుంచి దూరంగా వెళ్లి తప్పిపోయాడు.

అతడి కోసం వెతకగా అటవీ సిబ్బందికి ఐదు రోజుల తర్వాత గ్రామానికి 50 కిలోమీటర్ల దూరంలో, మటుసడోనా నేషనల్ పార్క్‌లో కనపడ్డాడు. ఆ సమయంలో అతడు నీరసంగా కనపడ్డాడు. అతడికి అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ బాలుడు అతడికి తెలియకుండానే ప్రమాదకరమైన మాటుసడోన్హా గేమ్ పార్క్‌లోకి వెళ్లాడని అధికారులు తెలిపారు.

గర్జించే సింహాలు, ఏనుగులను ఘీంకారం మధ్య అతడు బిక్కు బిక్కుమంటూ గడిపాడని చెప్పారు. వాటికి  మాటుసడోనా గేమ్ పార్కులో దాదాపు 40 సింహాలు ఉంటాయి. ఆ బాలుడు ఆ అడవిలో ఐదు రోజుల పాటు బతికిన తీరుపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.

Game Changer Ticket Prices : ఏపీలో ‘గేమ్ ఛేంజర్’ టికెట్ రేట్లు పెంపు.. పుష్ప 2 కంటే తక్కువే..