CCTV cameras : న్యూయార్క్,లండన్, షాంఘైలను దాటేసిన ఢిల్లీ
సీసీ కెమెరాల ఏర్పాటులో ఢిల్లీకి ప్రపచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో లండన్. మూడో స్థానంలో చెన్నై నిలిచాయి.

Cctv Cameras Set Up In Delhi
CCTV cameras set up in Delhi : ప్రపంచంలోనే మొదటి నగరంగా భారత దేశ రాజధాని ఢిల్లీ నిలించింది. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత అభివృద్ది చెందిన నగరాలైన న్యూయార్క్,లండన్, షాంఘై నగరాలను దాటేసి ప్రపంచంలోనే మొదటి నగరంగా నిలిచింది. సీసీ కెమెరాల ఏర్పాటులో ఢిల్లీకి అగ్రస్థానంలో నిలవగా రెండో స్థానంలో యూకేలోని బ్రిటన్ దేశంలోని గ్రేట్ లండన్. మూడో స్థానంలో చెన్నై నిలిచింది.బహిరంగ ప్రదేశాల్లో అత్యధిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన నగరంగా ఘనతను సాధించిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.
ఢిల్లీ ఈ ఘనతను సాధించడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీలో ప్రతి చదరపు మైలుకు సరాసరిన 1826 సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిపారు. లండన్ లో 1138, ఇతర నగరాల్లో అంతకంటే తక్కువ ఉన్నాయని చెప్పారు. అతి తక్కువ సమయంలోనే ఈ ఘనతను సాధించినందుకు ఇంజినీర్లకు, అధికారులకు అభినందనలు తెలియజేశారు.దీనికి ఫోర్బ్స్ ఇండియాను ప్రతిపదికగా చూపించారు.
ఢిల్లీలో మొత్తం 2.8 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆప్ ప్రభుత్వం ఆ బాధ్యతను పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ కు అప్పగించింది. 2019 డిసెంబర్ నాటికే 1.05 లక్షల కెమెరాలను ఏర్పాటు చేసింది. ప్రపంచంలో అత్యధిక సీసీ కెమెరాలు కలిగిన నగరాల్లో ఢిల్లీ తొలి స్థానంలో, రెండో స్థానంలో లండన్ ఉండగా… మూడో స్థానంలో మళ్లీ మన దేశానికి చెందిన నగరమే నిలిచింది. చెన్నై మూడో స్థానాన్ని దక్కించుకుంది. చెన్నైలో ప్రతి చదరపు మైలుకు 609 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ జాబితాలో మన దేశ ఆర్థిక రాజధాని ముంబై 18వ స్థానంలో నిలిచింది.
మొదటి దశలో 2.75 లక్షల కెమెరాలు ఏర్పాటు చేయగా..1.4 లక్షల కెమెరాలను ఏర్పాటు చేసే పని జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 150 నగరాలను పరిశీలించగా..ఢిల్లీ ఒక చదరపు మైలుకు 1,826 సీసీటీవీలతో అగ్రస్థానంలో ఉంటే..చెన్నై కంటే మూడు రెట్లు ఎక్కువ మరియు ముంబై కంటే 11 రెట్లు ఎక్కువ” అని ప్రకటన పేర్కొంది.
లెఫ్టినెంట్ గవర్నర్ మరియు కేంద్రం నుండి నిరంతర రహదారుల అడ్డంకులు ఉన్నప్పటికీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం ఢిల్లీలో మహిళల భద్రతను పెంచడంలో వెనకడుగు వేయలేదని మరియు సీసీటీవీకి మార్గం సుగమం చేయడానికి LG నివాసం వెలుపల ధర్నాలో కూర్చుందని ఆరోపించింది. ఢిల్లీ ప్రభుత్వం మొదటి దశలో 2.75 లక్షల కెమెరాలు ఏర్పాటు చేసింది. మరో 1.4 లక్షల కెమెరాలను ఏర్పాటు చేసే పని జరుగుతోంది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన సీసీటీవీ లెక్క చూస్తే చెన్నై కంటే మూడు రెట్లు ఎక్కువ. అలాగే ముంబై కంటే 11 రెట్లు ఎక్కువ.