మందకొడిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ : సా.4 గం.ల వరకు 45 శాతం పోలింగ్‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సరళి మందకొడిగా సాగుతోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు 45 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • Published By: veegamteam ,Published On : February 8, 2020 / 11:03 AM IST
మందకొడిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ : సా.4 గం.ల వరకు 45 శాతం పోలింగ్‌

Updated On : February 8, 2020 / 11:03 AM IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సరళి మందకొడిగా సాగుతోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు 45 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సరళి మందకొడిగా సాగుతోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు 45 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 70 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 60వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎన్నికల బరిలో మొత్తం 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కోటి 47లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సీఎం కేజ్రీవాల్ పోటీచేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఢిల్లీలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ నెల 11న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.

13,750 బూత్‌ల్లో పోలింగ్  కొనసాగుతోంది. 1.47కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల విధుల్లో 5వేల మంది ఢిల్లీ పోలీసులు, పారా మిలటరీ దళాలు, 190 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ బలగాల బందోబస్తుగా ఉన్నారు. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సివిల్‌ లైన్స్‌లో ఉన్న పోలింగ్‌ కేంద్రంలో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కు నియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా ఆమ్‌ ఆద్మీ పార్టీయే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  
 
పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.