నన్ను మూడోసారి ప్రధానిని చేయాలని నేను అడుగుతున్నది ఇందుకే..: మోదీ

Narendra Modi: ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని తెలిపారు. తాను గ్యారంటీ ఇస్తున్నానని అన్నారు.

నన్ను మూడోసారి ప్రధానిని చేయాలని నేను అడుగుతున్నది ఇందుకే..: మోదీ

Narendra Modi

బీజేపీ సైన్యాన్ని చూస్తే విపక్షాలకు భయం పుడుతోందని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ జాతీయ మండలి సమావేశంలో మోదీ మాట్లాడారు. బీజేపీ నేతలు ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని పిలుపునిచ్చారు. తనను మూడోసారి ప్రధానిని చేయాలని తాను అడుగుతున్నది ఎంజాయ్ చేయడానికి కాదని మోదీ అన్నారు.

‘నేను నా ఇంటి గురించే ఆలోచించితే.. దేశంలోని కోట్లాది మంది పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే వాడిని కాదు. పేద పిల్లల భవిష్యత్తు కోసమే నేను బతుకుతున్నాను. నేను సమస్యలను పరిష్కరిస్తానని భావిస్తున్న కోట్లాది మంది మహిళలు, పేదలు, యువత కలలను నెరవేర్చడానికే నేను ఉన్నాను’ అని మోదీ చెప్పారు.

ఈ దేశ కలలు ఎన్డీఏ కూటమితోనే నెరవేరతాయని మోదీ చెప్పారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని తెలిపారు. తాను గ్యారంటీ ఇస్తున్నానని అన్నారు. రికార్డు స్థాయిలో ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు నిర్మించామని తెలిపారు.

దేశ ప్రజలే తన కుటుంబమని మోదీ చెప్పారు. గత 10 సంవత్సరాల్లో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. దేశంలో దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న పనులను ధైర్యంగా పూర్తి చేశామని అన్నారు. రామమందిర నిర్మాణం, కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం, ఆర్టికల్ 370 రద్దు, కొత్త విద్యా విధానం అమలు వంటి మార్పుల కోసం దేశ ప్రజలు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారని చెప్పారు.

చంద్రబాబూ దమ్ముంటే రా.. నీ చరిత్ర ఏంటో నా చరిత్ర ఏంటో చర్చిద్దాం : ఎమ్మెల్యే కరణం బలరాం