Farmers Protest: రోడ్డెక్కిన రైతులు.. మరోసారి మూసుకుపోయిన ఢిల్లీ-ఛండీగఢ్ జాతీయ రహదారి
మహాపంచాయత్ నిర్వహించి సోమవారం మధ్యాహ్నం నుంచి ఢిల్లీ-చండీగఢ్ హైవే(NH-44)తో పాటు మరికొన్ని మార్గాలను రైతులు దిగ్బంధించారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ తికాయత్ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి జిల్లా యంత్రాంగంతో రెండుసార్లు సమావేశం నిర్వహించామని, అయితే చర్చలు ఎటువంటి ఫలితం ఇవ్వలేదని అన్నారు

Delhi-Chandigarh Highway: పొద్దుతిరుగుడు విత్తనాలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను డిమాండ్ చేస్తూ హర్యానాలోని కురుక్షేత్ర జిల్లాలోని పిప్లిలో రైతులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎంఎస్‌పీపై జిల్లా యంత్రాంగంతో రెండు రౌండ్ల చర్చలు ఎటువంటి ఫలితం ఇవ్వకపోవడంతో తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించడానికి ఈరోజు సాయంత్రం సమావేశం నిర్వహించనున్నారు.
Adipurush : తెలుగు తెర పై శ్రీరాముడిగా కనిపించిన నటులు.. వెండితెరపై మొదటి రాముడు ఎవరో తెలుసా?
ఈ అంశంపై మహాపంచాయత్ నిర్వహించి సోమవారం మధ్యాహ్నం నుంచి ఢిల్లీ-చండీగఢ్ హైవే(NH-44)తో పాటు మరికొన్ని మార్గాలను రైతులు దిగ్బంధించారు. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేష్ తికాయత్ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి జిల్లా యంత్రాంగంతో రెండుసార్లు సమావేశం నిర్వహించామని, అయితే చర్చలు ఎటువంటి ఫలితం ఇవ్వలేదని అన్నారు. సోమవారం ఏర్పాటైన స్థానిక రైతుల కమిటీ, సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నాయకులు మంగళవారం సమావేశం నిర్వహించి తదుపరి కార్యాచరణను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.
Amit Shah and Prabhas: రాజమౌళి, ప్రభాస్తో భేటీకానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా?
పొద్దుతిరుగుడు పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) సమస్య హర్యానాలోని రైతులను మాత్రమే కాకుండా మొత్తం రైతు సమాజాన్ని ప్రభావితం చేస్తోందని తికాయత్ అన్నారు “మేము రైతు ఆందోళనను (వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన) ఉపసంహరించుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా అన్ని పంటలకు ఎంఎస్‌పీ చట్టాన్ని డిమాండ్ చేస్తున్నాం” అని అన్నారు.
Pune-Mumbai Expressway: ముంబై-పూణె హైవేపై ఘోర ప్రమాదం.. పేలిన ట్యాంకర్, నలుగురు మృతి
ఇక పొద్దుతిరుగుడు విత్తనాలకు కనీస మద్దతు ధరను డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన తొమ్మిది మంది రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై కురుక్షేత్ర పోలీసు సూపరింటెండెంట్ ఎస్ఎస్ భోరియా మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం దిగ్బంధనాన్ని ఎత్తివేసేందుకు రైతులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తోందని, దీనికి పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.