కరోనా అనుమానితులకు పెయిడ్ లీవ్స్ ఇవ్వాలని సీఎం రిక్వెస్ట్

కరోనా అనుమానితులకు పెయిడ్ లీవ్స్ ఇవ్వాలని సీఎం రిక్వెస్ట్

Updated On : March 8, 2020 / 11:03 AM IST

ప్రపంచవ్యాప్తంగా వణికిస్తోన్న కరోనా.. ఢిల్లీకి పాకడమే కాకుండా 3కేసులు పెరిగాయి. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ స్పందించారు. ఆ ముగ్గురికి వైద్య పరీక్షలు నిర్వహించామని వాళ్లు ఎవరెవరినీ కలిశారో విచారిస్తున్నారు. కరోనా సోకిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి 105 మంది, రెండో వ్యక్తి 168 మంది, మూడో వ్యక్తి 64 మందిని కలిసినట్లు గుర్తించామని కేజ్రీవాల్ చెప్పారు. వారందరి రక్త నమూనాలను సేకరించి టెస్టులు చేస్తున్నారు. 

అన్నీ జిల్లాల్లో నోడల్ ఎజెన్సీలు ఏర్పాటు చేసి వైరస్ సోకిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కరోనా వైరస్ పేషంట్ల కోసం 25 ఆస్పత్రుల్లో 168 ఐసోలేషన్ బెడ్లను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న వారికి పెయిడ్ లీవ్స్ ఇవ్వాలని సంస్థల యాజమాన్యానికి రిక్వెస్ట్ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 

కరోనా భయంతో శానిటైజర్లు, మాస్క్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. దీనిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తూ.. మాస్క్‌లు ధర పెంచితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. AIIMS కరోనా పేషెంట్ల కోసం.. ప్రత్యేకంగా ఐసోలేషన్ బెడ్స్ ను సిద్ధం చేయనుంది. కరోనా పేషెంట్లను గుర్తించేందుకు స్పెషల్ ఎంట్రీ గేట్లను కూడా సిద్ధం చేసింది హాస్పిటల్ యాజమాన్యం.