మోడీ కి ధన్యవాదాలు..ఏళ్ల నాటి కల సాకారం చేశారన్న కేజ్రీవాల్

  • Published By: venkaiahnaidu ,Published On : October 23, 2019 / 02:54 PM IST
మోడీ కి ధన్యవాదాలు..ఏళ్ల నాటి కల సాకారం చేశారన్న కేజ్రీవాల్

Updated On : October 23, 2019 / 2:54 PM IST

ఢిల్లీలో అనధికార కాలనీలను క్రమబద్ధీకరించాలని ఇవాళ(అక్టోబర్-23,2019) కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో 1,797 అనధికార కాలనీలలో నివసిస్తున్న 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పించాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం అని,ఇది ఢిల్లీ వాసులు ఏళ్ల నాటి డిమాండ్ అని సీఎం తెలిపారు.

ఢిల్లీ ప్రజల తరపున తాను కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నానని కేజ్రీవాల్ తెలిపారు. నవంబర్-18,2019నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం ఈ బిల్లు ప్రవేశపెట్టనుంది. 2020 ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ నిర్ణయం బీజేపీకి లాభం చేకూరుస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.