Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత వాట్సాప్ ఛానల్‌ ప్రారంభం

ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత వాట్సాప్ ఛానల్‌ని ప్రారంభించారు. ఢిల్లీ సీఎంఓ వాట్సాప్ ఛానల్ ఈ వారం ప్రారంభంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ వాట్సాప్ ఛానల్ ఇప్పటివరకు 51వేల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది....

Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత వాట్సాప్ ఛానల్‌ ప్రారంభం

Delhi CM Arvind Kejriwal WhatsApp channel

Delhi CM Arvind Kejriwal : ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత వాట్సాప్ ఛానల్‌ని ప్రారంభించారు. ఢిల్లీ సీఎంఓ వాట్సాప్ ఛానల్ ఈ వారం ప్రారంభంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ వాట్సాప్ ఛానల్ ఇప్పటివరకు 51వేల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రాన్ని ప్రస్తావించి ప్రజలంతా కలిసికట్టుగా భారతదేశాన్ని నంబర్ వన్ దేశంగా మార్చాలని సీఎం కేజ్రీవాల్ అభ్యర్థించారు. (Delhi CM Arvind Kejriwal) సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో కేజ్రీవాల్ తన వ్యక్తిగత వాట్సాప్ ఛానల్‌ లింక్‌ను పంచుకున్నారు.

UK PM Rishi Sunak : యూకేలో త్వరలో సిగరెట్లపై నిషేధాస్త్రం…ప్రధాని రిషి సునక్ యోచన

‘‘నా వాట్సాప్ ఛానల్ ద్వారా మీ అందరితో కనెక్ట్ అవ్వడానికి సంతోషిస్తున్నాను. భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా చేయడానికి కలిసి పని చేద్దాం’’ అని సీఎం కేజ్రీవాల్ కోరారు.(personal WhatsApp channel) కేజ్రీవాల్‌తో నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశాన్ని ప్రజలకు అందించడానికి ఈ వాట్సాప్ ఛానల్ ఏర్పాటు చేశారు. (Arvind Kejriwal launches)

Telangana Rain : తెలంగాణకు భారీ వర్ష సూచన.. రెండు రోజులు కుమ్ముడే, హైదరాబాద్‌తో పాటు 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్

భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా మార్చేందుకు ప్రజలు ఏకం కావాలని కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. ‘‘జవాన్ చాలా మంచి చిత్రం, ఇందులో షారుక్ ఖాన్ మాట్లాడుతూ కులం లేదా మతం ఆధారంగా ఓటు వేయవద్దు, బదులుగా మీ పిల్లలకు మంచి విద్యను అందిస్తారా? మంచి వైద్యం అందిస్తారా? అని అభ్యర్థులను అడగండి’’ అని కేజ్రీవాల్ అన్నారు.

Mynampally Hanumantha Rao : బీఆర్ఎస్‌కు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజీనామా, త్వరలో కాంగ్రెస్‌లో చేరే ఛాన్స్..!

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా మీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తాం కాబట్టి మీ ఓటు మాకు ఇవ్వాలని ఆత్మవిశ్వాసంతో చెప్పింది ఆప్ మాత్రమే అని ఆయన నొక్కి చెప్పారు. తన ప్రభుత్వం ఢిల్లీ నగరంలో అద్భుతమైన పాఠశాలలను నిర్మించిందని, పంజాబ్ రాష్ట్రంలోనూ భగవంత్ మాన్ విద్యా విప్లవం తీసుకువస్తున్నారని సీఎం కేజ్రీవాల్ వివరించారు. వ్యక్తిగత వాట్సాప్ ఛానల్ ను ప్రారంభించిన మొదటి ముఖ్యమంత్రిగా అర్వింద్ కేజ్రీవాల్ నిలిచారు.