Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు మళ్లీ నోటీసులు పంపిన ఈడీ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ తమ నేతలపై చర్యను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తోంది. రాజకీయ ప్రతీకారం కోసం తమ పార్టీని నాశనం చేయాలని బీజేపీ చూస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు పిలిచింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో డిసెంబర్ 21న హాజరు కావాలని ఈడీ కోరింది. అంతకుముందు నవంబర్ 2న ఇదే విషయమై కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసు పంపింది. అయితే ఆ నోటీసు చట్టవిరుద్ధమని, దానిని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదే రోజు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రోడ్ షోలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. జ్రీవాల్ 10 రోజుల విపస్సనా ధ్యాన కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ తరుణంలో సమన్లు పంపారు.
ఇది కూడా చదవండి: పార్లమెంట్ ఎన్నికలు.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు కీలక బాధ్యతలు
ఢిల్లీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన మరుసటి రోజు మంగళవారం కేజ్రీవాల్ దేశ రాజధాని నుంచి బయలుదేరనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చాలా కాలంగా విపస్సనా సాధన చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా బెంగళూరు, జైపూర్‌తో సహా అనేక ప్రాంతాలను సందర్శించారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇతర నిందితులను విచారించడంలో భాగంగా కేజ్రీవాల్‌ను ప్రశ్నించాలని ఈడీ సమన్లు పంపింది.
ఇది కూడా చదవండి: లోక్‌సభ తర్వాత ఇప్పుడు రాజ్యసభ వంతు.. 34 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ తమ నేతలపై చర్యను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తోంది. రాజకీయ ప్రతీకారం కోసం తమ పార్టీని నాశనం చేయాలని బీజేపీ చూస్తోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. గత సారి సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసు పంపినప్పుడు ఆయనను జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతోందని ఆప్ పేర్కొంది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని జైలు నుంచే నడిపిస్తామని ఆ పార్టీ ప్రచారం చేసింది. మద్యం పాలసీ ద్వారా కొంతమంది డీలర్లు లబ్ధి పొందారని ఈడీ చెప్తోంది. దీనికి సంబంధించి విచారణ జరుగుతోంది.