Kejriwal Fired Purchase Of Goa MLAs : గోవా ఎమ్మెల్యేల కొనుగోలుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఫైర్

గోవా ఎమ్మెల్యేల కొనుగోలుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తీవ్రంగా స్పందించారు. బీజేపీ 'ఆపరేషన్‌ లోటస్‌'ను అన్ని రాష్ట్రాలలో చేపడుతోందని మండిపడ్డారు. పంజాబ్‌లో రూ.25 కోట్లతో ఎమ్మెల్యేను కొనేందుకు యత్నించారని ఆరోపించారు. గోవాలో ఎమ్మెల్యేలను ఎంత ధరకు కొన్నారన్నది అక్కడి ప్రజలే చెప్పాలన్నారు.

Kejriwal Fired Purchase Of Goa MLAs : గోవా ఎమ్మెల్యేల కొనుగోలుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఫైర్

Kejriwal Fired Purchase Of Goa MLAs

Updated On : September 14, 2022 / 8:28 PM IST

Kejriwal Fired Purchase Of Goa MLAs : గోవా ఎమ్మెల్యేల కొనుగోలుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తీవ్రంగా స్పందించారు. బీజేపీ ‘ఆపరేషన్‌ లోటస్‌’ను అన్ని రాష్ట్రాలలో చేపడుతోందని మండిపడ్డారు. పంజాబ్‌లో రూ.25 కోట్లతో ఎమ్మెల్యేను కొనేందుకు యత్నించారని ఆరోపించారు.

గోవాలో ఎమ్మెల్యేలను ఎంత ధరకు కొన్నారన్నది అక్కడి ప్రజలే చెప్పాలన్నారు. ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీకి కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ప్రతిరాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొంటున్నారని తెలిపారు.

CM Arvind Kejriwal: అలా అయితే 100 సంవత్సరాలు పడుతుంది..! ప్రధాని మోదీకి అరవింద్ కేజ్రీవాల్ లేఖ..

కొందరిని సీబీఐ, ఈడీ దాడులతో భయపెడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ధనాన్ని కేంద్రం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. ఈ కారణంగానే దేశంలో ధరలు పెరుగుతున్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు.